Begin typing your search above and press return to search.
చంద్రబాబు శాశ్వత అధ్యక్షుడు కాదా ?
By: Tupaki Desk | 9 July 2022 6:46 AM GMTఅధికార వైసీపీ నిర్వహించుకుంటున్న ప్లీనరీ సమావేశాలపై చంద్రబాబునాయుడు అండ్ కో రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమావళిని సవరించకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. సరే నియమావళిని సవరించుకుంటారా లేదా ఎన్నికలు జరిపి అధ్యక్షుడిని ఎన్నుకుంటారా అన్నది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం.
దీనిపై చంద్రబాబు కానీ లేదా టీడీపీ నేతలు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జగనే శాశ్వత అధ్యక్షుడనే ప్రచారంపై చంద్రబాబు నగిరి రోడ్డుషోలో విరుచుకుపడ్డారు. గౌరవాధ్యక్షురాలిగా తల్లి విజయమ్మతో రాజీనామా చేయించారని మండిపడ్డారు.
జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఉండటంపై చంద్రబాబు ఆక్షేపించారు. జగనే శాశ్వత అధ్యక్షుడట..ఇక ఎన్నికలే జరపవట..ఇదేం పార్టీ..ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయా ? అని రెచ్చిపోయారు.
ఇక్కడే అందరిలోను ఒక అనుమానం వస్తోంది. చంద్రబాబు స్ధానంలో టీడీపీకి ఎప్పుడైనా ఎవరైనా అధ్యక్షుడయ్యారా ? మహానాడులో చంద్రబాబును అధ్యక్షుడిగా ఎన్నుకోవటం కేవలం నామమాత్రపు తంతుకాదా ? చంద్రబాబును కాదని ఇంకెవరినైనా అద్యక్షుడిగా ఎన్నుకున్న చరిత్రుందా ? నామమాత్రపు తంతు ద్వారా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఏమిటి ? పార్టీ నియమావళిని సవిరించుకుని అధ్యక్షుడిగా తీర్మానం చేసుకుంటే ఏమిటి ?
పార్టీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవటం నియమ, నిబంధనల ప్రకారం చెల్లదంటే అది పార్టీకి ఎన్నికల కమీషన్ కు మధ్య వ్యవహారం. ఇది వైసీపీకి సంబంధించింది మాత్రమే కాదు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలాగే ఉంటుంది.
ఈ మాత్రం దానికే చంద్రబాబు అండ్ కో ఇంతలా రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. ప్లీనరీ సందర్భంగా జగన్ లేదా ఇతరులు మాట్లాడిన విధానపరమైన అంశాలపై అభ్యంతరాలుంటే ఎక్కడికక్కడ తిప్పి కొట్టడంలో తప్పేలేదు. లేదా ప్రభుత్వంలో లోపాలంటు ఎండగట్టాల్సిందే అనటంలో సందేహం లేదు. అంతేకానీ జగన్ ఏమిసాధించారని ప్లీనరీ పెట్టుకుంటున్నారనటంలో అర్ధమేలేదు.