Begin typing your search above and press return to search.

మాగంటిపై బాబు ఏం చేయబోతున్నాడు?

By:  Tupaki Desk   |   17 Sept 2020 12:30 AM
మాగంటిపై బాబు ఏం చేయబోతున్నాడు?
X
టీడీపీ ఓటమి తర్వాత అధినేత చంద్రబాబుకు నేతలను కాపాడుకునేందుకే టైం సరిపోవడం లేదు. ఒక్కొరొక్కరు నేతలు వదిలిపోతుంటే తలపట్టుకుంటున్నారట.. ఈ క్రమంలోనే సీనియర్ నేతల మౌనం కంగారు పెడుతోందట..

తాజాగా ఏలూరు పార్లమెంట్ లో కూడా కీలక నేత వైదొలిగేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఏలూరు పార్లమెంట్ వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోందట.. ఏలూరు మాజీ ఎంపీ, పార్టీ ఇన్ చార్జి అయిన మాగంటి వెంకటేశ్వరరావును మార్చాలనేది చంద్రబాబు నిర్ణయమని ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన మాగంటి ఆ తర్వాత నుంచి టీడీపీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నాడట.. యాక్టివ్ లేకపోవడం.. ఆరోగ్య కారణాలతో ఆయన టీడీపీలో ఉన్నారా? లేరా అన్నట్టుగానే ఉంటున్నారు.

దీంతో చంద్రబాబు పార్టీని అక్కడ బలోపేతం చేసేందుకు చూస్తున్నారట.. మాగంటితో చర్చలు జరపాలని.. ఒకవేళ ఆయన ఒప్పుకోకుంటే మార్చాలని కూడా యోచిస్తున్నట్టు ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం మాగంటి కుమారుడు రాంజీ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను మాగంటి స్థానంలో ఏలూరు ఇన్ చార్జిగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాగంటి స్థానంలో యువకుడైన ఆయన కుమారుడికి ఇన్ చార్జి ఇస్తే శ్రేణుల్లో జోష్ నింపవచ్చని అనుకుంటున్నారట..

బలమైన కమ్మసామాజికవర్గం కావడం.. నిధులు సర్ధుబాటు చేసేంత ఆర్థికంగా ఉండడంతో మాగంటి విషయంలో తొందరపడకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది.