Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌తో చెలిమి.. బాబు ప్ర‌భ వెలిగేనా.. ?!

By:  Tupaki Desk   |   25 Oct 2022 10:57 AM IST
ప‌వ‌న్‌తో చెలిమి.. బాబు ప్ర‌భ వెలిగేనా..  ?!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌భ వెలిగిపోతుందా? ఆయ‌న దూకుడు మ‌రింత పెరుగుతుందా? అధికార పీఠం అనుకున్న‌ట్టుగానే ద‌క్కుతుందా. ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌ధాన చర్చ‌. దీనికి కార‌ణం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కు చేతులు క‌లుపుతున్నామ‌ని చెబుతున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ.. చేతులు క‌ల‌ప‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇది ఏమేర‌కు బాబుకు క‌లిసి వ‌స్తుంది? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014లో ఉన్న వాతావ‌ర‌ణం.. రాజ‌కీయ అవ‌స‌రం వేరు.

అప్ప‌ట్లో జ‌న‌సేన తొలి అడుగులు ప్రారంభ‌మ‌య్యాయి. సో.. ఆ పార్టీపై ప్ర‌జ‌లకు అంత‌గా రాజ‌కీయ అవ‌గాహ‌న లేదు. కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్‌.. ఆయ‌న హ‌వాతోనే ప్ర‌జ‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపార‌నే వాద‌న ఉంది.

అయితే.. ఇప్ప‌టికి 8 ఏళ్లు పూర్తయిన నేప‌థ్యంలో ప‌వ‌న్ గురించిన ఒక అవ‌గాహ‌న ఉంది. ఆయ‌న గురించి.. రాజ‌కీయ పార్టీగా జ‌న‌సేన గురించి కూడా.. ప్ర‌జ‌ల‌కు ఒక అవగాహ‌న ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ప్ర‌జ‌లు ఏమేరకు స్వాగ‌తిస్తారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది ప్ర‌శ్న‌.

ఈ 8 సంవ‌త్స‌రాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీగా జ‌న‌సేన ప్ర‌జ‌ల్లో ఉందా ? ఉంటే.. ఏం చేసింది? ఒక ప్ర‌జా ఉద్య‌మాన్ని నిర్వ‌హించిందా? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే.. అమావాస్య‌కు ఒక‌సారి.. పౌర్ణ‌మికి ఒక‌సారి అన్న‌ట్టుగా.. ప‌వ‌న్ రావ‌డం.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం అనంత‌రంఆయ‌న సినిమా షూటింగులకు వెళ్లిపోవ‌డం కామ‌న్‌గా మారిపోయింది.

దీంతో ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్‌కు మధ్య రాజ‌కీయ బంధం.. పెర‌గ‌లేద‌నేది నిష్టుర స‌త్యం. అయితే.. ఆయ‌న స‌భ‌ల‌కు జ‌నం వెల్లువ‌లా వ‌స్తున్నారు క‌దా అంటే.. వ‌స్తారు.. ఇప్పుడే కాదు.. 2019 ఎన్నిక‌ల స‌భ‌ల్లోనూ .. ఇసుకేస్తే.. రాల‌నంత వ‌చ్చారు.

కానీ, ఎన్ని ఓట్లు తెచ్చారు ? అనేది ప్ర‌ధానం. పైగా.. గ్రామీణ స్థాయిలో జ‌న‌సేన‌కు ప‌ట్టు ఉందా ? అనేది కూడా.. ప్ర‌శ్న‌. రాష్ట్ర ఎన్నిక‌ల‌ను ఇప్ప‌టి వ‌రకు ప‌రిశీలిస్తే.. గ్రామీణ ఓటు బ్యాంకే ప్ర‌భావితం చేస్తోంది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కువిలేజ్ లెవిల్లో ఉన్న బ‌లం పెద్ద‌గా లేద‌నేది వాస్త‌వం. సో.. చంద్ర‌బాబు ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నా.. ఒరిగేది ప్ర‌త్యేకంగా ఉండ‌ద‌ని.. టీడీపీ సంస్థాగ‌తంగా.. వ్య‌క్తిగ‌తంగా ముందుకు సాగ‌క త‌ప్ప‌ద‌నే సూచ‌న‌లు అంచ‌నాలు వ‌స్తున్నాఇయ‌. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.