Begin typing your search above and press return to search.
బాబుగారి తెలివి ప్రభుత్వానికి లేఖ.. విషయం ఏంటంటే...!
By: Tupaki Desk | 12 Dec 2021 3:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు చాలా తెలివిగలవారనే ప్రచారం ఉంది. ఆయన ఏం చేసినా.. దూరదృష్టి (విజన్)చాలా ఎక్కువని కూడా తెలిసిందే. ముందుగానే కొన్ని కొన్ని సంఘటనలను ఊహించి.. ఆయన వ్యవహరించే తీరు.. మరోసారి తెరమీదికి వచ్చింది. ఇటీవల కాలంలో ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వా నికి లేఖలు సంధిస్తున్నారు. సమస్యలు ఏవైనాకూడాచంద్రబాబు స్పందిస్తున్నారు. అయితే.. వీటిని కూడా రాజకీయంగానే చూడాలని అనుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఇటీవల వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా.. కొంద సాయం కూడా అందించారు. ఇంత వరకు బాగానే మైలేజీ దక్కింది. అయితే.. ఇక్కడ నుంచి మంగళగిరి లోని ఆఫీస్‌కు చేరుకున్నాక మాత్రం.. ఆయన దీనిని రాజకీయం చేశారు. నేను వెళ్లాను కాబట్టి.. సీఎం జగన్ వెళ్లాడు! ముందు నేను స్పందించకపోతే.. సీఎం స్పందించేవాడు కాదు! అని రాజకీయంగా డైలాగులు పేల్చారు చంద్రబాబు.
ఈ డైలాగులు చంద్రబాబుకు అప్పటి వరకువచ్చిన మైలేజీని డ్యామేజీ చేశాయి. అయినా.. పార్టీలోను, చంద్రబాబులోనూ మార్పుకనిపించలేదు. ఇక, ఇప్పుడు.. తాజాగా తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ వీరమరణం పొందారు. ఇంకా.. ఈయన మృతదేహాన్ని గుర్తించలేదు. ఎందుకంటే.. గుర్తించేందుకు వీలు లేని విధంగా.. కాలిపోయిన ఐదు మృతదేహాల్లో సాయితేజ కూడా ఉన్నారు.
సో.. ఇంకా.. ఈ ప్రక్రియ పూర్తికాలేదు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి లేఖ సంధించారు. సాయితేజ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రషబుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ ను సంధించారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు సంభవించినప్పుడు.. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదారంగా స్పందించి.. ఆయా కుటుంబాలను ఆదుకుంటాయి. ఇది ఎప్పుడూ జరిగేదే.
దీనికి ఎవరి డిమాండ్లు అవసరం లేదు. కానీ, ఎలాగూ సాయం చేస్తారు అనే విషయం తెలిసి కూడా చంద్రబాబు లేఖ రాయడం ఎందుకంటే.. సదరు సాయం అందిన తర్వాత.. అదిగో నేను లెటర్ రాయబట్టే సీఎం జగన్ స్పందించారు! అని లెక్కలేసుకుని ..ప్రచారం చేసుకునేందుకేనని అంటున్నారు పరిశీలకులు. అయినా.. చంద్రబాబు ఇవి తెలిసి కూడా లేఖ రాశారంటే.. ఆయన తెలివి తేటలను మెచ్చుకోవాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు.