Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ వ‌ర్సెస్‌.. కుప్పం.. ఈ లెక్క చూడు బాబూ..!

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:30 PM GMT
హుజూరాబాద్ వ‌ర్సెస్‌.. కుప్పం.. ఈ లెక్క చూడు బాబూ..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌రిగిన కుప్పం మునిసిపాలిటీలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కేవ‌లం ఐదు వార్డుల‌కే ఆ పార్టీ విజ‌యం ప‌రిమిత‌మైంది. దీనికి టీడీపీ అధినేత నుంచి క్షేత్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా.. అనేక విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.

ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. ఓట‌ర్ల‌కు భారీ ఎత్తున నిధులు పంచింద‌ని.. ఓటుకు ప‌ది వేల వ‌ర‌కు పంచార‌ని.. ఒక్క కుప్పంలోనే రూ.10 కోట్ల వ‌ర‌కు పంపిణీ చేశార‌ని.. టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు విమ‌ర్శించారు. ఇక‌, అచ్చెన్నాయుడు కూడా.. ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌భుత్వం పోలీసుల బ‌ల‌ప్ర‌యోగం ఇక్క‌డ చూపింద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. టీడీపీ శ్రేణుల‌పై కేసులు న‌మో దు చేసింద‌ని.. నాయ‌కుల‌ను గృహ నిర్బంధం చేసింద‌ని.. పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే.. ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కింద‌ని.. అచ్చెన్న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ విజ‌యం పోలీసు డీజీపీ గౌతం స‌వాంగ్‌కు అంకితం చేయాల‌ని అన్నారు.

ఓకే..! వీరుచెప్పిందే నిజం అనుకుందాం. నిజంగానే పోలీసు లు.. ఇత‌ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఒత్తిడి ఉంటే.. ప్ర‌జ‌లు త‌మ మ‌న‌సులో ఉన్న పార్టీని వ‌దులుకుంటారా? త‌మ‌కు ఉన్న స్వేచ్ఛ‌ను వ‌దులుకుంటారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎలా అంటే.. పొరుగున ఉన్న తెలంగాణ‌లో ఇటీవ‌ల హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగిం ది. అక్క‌డ కూడా ఈ స్థానం ద‌క్కించుకునేందుకు అధికార టీఆర్ ఎస్ పార్టీ బ‌ల ప్రయోగానికి దిగింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. డ‌బ్బులున్న సంచుల‌ను ప్ర‌జ‌ల ఇళ్ల‌కు వెళ్లి అందించార‌ని.. ఓటు రూ. 5 వేల వ‌ర‌కు ఇచ్చార‌నిగ‌గ్గోలు పుట్టింది. ఇక‌, పోలీసులు ప్ర‌తిప‌క్షం బీజేపీ నేత‌ల‌ను గృహ నిర్బంధం చేశారు.

దీంతో అంతా.. కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా జరిగిపోతుంద‌ని అనుకున్నారు. కానీ, తీరా ఎన్నికల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వానికి ఇక్క‌డ ప్ర‌జ‌ల గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

టీఆర్ ఎస్ త‌ర‌ఫున నిలిచిన గెల్లు శ్రీనివాస్‌ను చిత్తుగా ఓడించారు. బీజేపీ అభ్య‌ర్థి, మాజీ మంత్రి.. ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించారు. అంటే.. ఇక్క‌డ మ‌న‌కు క‌నిపిస్తున్న విష‌యం.. ఈట‌ల‌పై ఉన్న సానుభూతిని.. ఏ ప్ర‌లోభాలూ.. పోలీసుల ఒత్తిళ్లు.. ఏమీ ప‌నిచేయ‌లేద‌నే విష‌యం స్ప‌ష్టమైంది.

సో.. సానుభూతే వ‌ర్క‌వుట్ అయింది. మ‌రి ఇదే ఫార్ములా.. కుప్పంలోనూ వ‌ర్కువుట్ అవ్వాలి క‌దా ? చంద్ర‌బాబుపై నిజంగా సానుభూతి ఉంటే.. ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వం టీడీపీ చెప్పిన‌వ‌న్నీ చేసినా.. గోప్యంగా జ‌రిగే ఓటింగ్‌లో ప్ర‌జ‌లు త‌మకు న‌చ్చిన పార్టీ టీడీపీని గెలిపించి ఉండేవారు క‌దా! అనేది వాద‌న‌. సో.. బాబుపై సానుబూతి కొర‌వ‌డుతోంద‌నే వాద‌నే త‌ప్ప‌.. మ‌రొక‌టి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.