Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 17 Dec 2020 11:32 AM GMTరాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో ఆ ప్రాంతానికి చెందిన రైతులు చేపట్టిన ఆందోళన ఏడాది పూర్తిచేసుకున్న సందర్బంగా.. అక్కడకు వచ్చారు ఏపీ విపక్ష నేత చంద్రబాబు. అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. అక్కడికి దగ్గర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు మాటల్ని చూస్తే.. సీఎం జగన్ మీద ఆయనకున్న అక్రోశం ఆయన ప్రతిమాటలోనూ వినిపించటం గమనార్హం. ఆయనేమన్నారంటే..
- ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. రైతులు.. మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారు.
- ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడారు.
- జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా? పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు.. మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చారు.
- సాక్షాత్తు పార్లమెంటు మీకు అండగా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు.
- జగన్ గాలి కబుర్లుచెప్పటం ఇప్పటికైనా మానుకోవాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. 19 నెలల్లో ఏం పీకారు?
- అమరావతిలో నాకు ఇల్లు లేదంటున్నారు. మీరు కట్టి ఏం పీకారు? ఒక కులంలో పుట్టటం నా తప్పా?
- కులం చూసి హైదరాబాద్ ని.. విశాఖను డెవలప్ చేయలేదు. నా దగ్గర జగన్ తెలివితేటలు పని చేయవు.
- ద్రైపతి వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైఎస్సార్ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది.
- శంకుస్థాపన స్థలాన్ని చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్లు తెరిచి అమరావతి ఉద్యమాన్ని చూడాలి. పోరాడుతున్న రైతులు.. మహిళలను వ్యాపారులు అంటారా? ఉద్యమకారులను బూటుకాలితో తంతారా? జుట్టు.. దుస్తులు పట్టుకొని లాగుతారా?
- శ్మశానం అన్న వారికి బుద్ధి ఉందా? ఒకసారి అవకాశం అంటే ప్రజలుఇచ్చారు. కానీ.. ఇది వారికి చివరిసారి అవుతుంది.
- ఈ ప్రభుత్వానికి మహిళల శాపం తగలక తప్పదు.
- ఒక సామాజిక వర్గంలో పుట్టటం నా తప్పా? ఈ రాష్ట్రానికి సంపద పెంచాలనుకోవటం నా తప్పా?
- ఈ వేదిక మీద ఉన్న నాయకులందరిదీ ఒకే కులమా? ప్రభుత్వాలు శాశ్వితం కాదు. నా దగ్గర నీ తెలివితేటలు పని చేయవు జగన్ రెడ్డి.
- ఒకసారి అవకాశమని ప్రజల్ని ముంచేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. 20నెలల్లో ఏమీ చేయని జగన్..మరో 12 నెలల్లో ఏం చేస్తారు?
- ఆయన తీరుతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు.
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన నేతలు.. కొడను తవ్వి ఎలుకనూ పట్టుకోలేకపోయారు.
- విశాఖలో వేల ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. పేటీఎం బ్యాచ్ మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో ఉద్యమం చేస్తోంది.
- అధికారం నాకు కొత్త కాదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నాం. తాటాకు చప్పుళ్లకు భయపడలేదు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టిన ఏకైక సీఎం జగన్.