Begin typing your search above and press return to search.
చంద్రబాబు డిమాండ్ లో అర్ధముందా ?
By: Tupaki Desk | 31 Aug 2021 2:43 PM GMTపోలీసుల స్వయంప్రతిపత్తి నిరూపించుకోవాలి అంటు తాజాగా చంద్రబాబునాయుడు చేసిన డిమాండ్ చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అసలు ఈ డిమాండ్ ఎలా చేస్తున్నారో కూడా అర్ధం కావటంలేదు. పోలీసుశాఖ స్వయంప్రతిపత్తిని నిరూపించుకోవాలని డిమాండ్ చేయటమే చాలా విచిత్రంగా ఉంది. పోలీసుశాఖకు స్వయంప్రతిపత్తి ఎక్కడి నుండి వచ్చింది ? పోలీసుశాఖ రాష్ట్రప్రభుత్వంలో ఒక భాగమని చంద్రబాబుకు తెలీదా ?
ప్రభుత్వంలో భాగమైన పోలీసుశాఖ స్వయంప్రతిపత్తితో ఎలా పనిచేయగలుగుతుంది ? అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు వినటానికి పోలీసులు ఎప్పటినుండో అలవాటుపడిపోయారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా పోలీసుశాఖను తనిష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ హయాంలో పోలీసులను స్వేచ్చగా పనిచేయనిచ్చారా ?
టీడీపీ అధికారంలో ఉండగా ఎంతమంది వైసీపీ నేతలు, ఎంఎల్ఏలపై తప్పుడు కేసులు పెట్టారో మరచిపోయినట్లున్నారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే భ్రమల్లో టీడీపీ నేతలు తమిష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అలాంటిది ఐదేళ్ళకే భ్రమలన్నీ తొలగిపోయేసరికి ఇపుడు నానా గోలచేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు పోలీసులను ఎలా ఉపయోగించుకున్నారో అలాగే ఇపుడు వైసీపీ కూడా ఉపయోగించుకుంటోంది. దీన్నే చంద్రబాబు అండ్ కో తట్టుకోలేకపోతున్నారు.
పోతే పోలీసులు స్వయంప్రతిపత్తి నిరూపించుకోవాలన్న పిచ్చిడిమాండ్ చంద్రబాబు చేయరు. నిజానికి పోలీసులకు పూర్తిస్వేచ్చ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నపార్టీ ఏది కూడా అలాంటి అవకాశం ఇవ్వదు పోలీసులకు. అందుకనే పోలీసుశాఖ అధికారపార్టీ చేతిలో పావుగా మారిపోయింది. పోలీసుశాఖను దుర్వినియోగం చేయటంలో వైసీపీ+టీడీపీ దొందు దొదే అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే తామేదో పోలీసులకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్లు చంద్రబాబు కలరింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.