Begin typing your search above and press return to search.
అర్థరాత్రి వేళ ఘాట్లలో బాబు తిరిగారా?
By: Tupaki Desk | 15 July 2015 7:23 AM GMTగోదావరి పుష్కరాల సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న తొక్కిసలాట.. ఈ దుర్ఘటనలో 27 మంది మరణించటం.. పెద్దఎత్తున భక్తులు గాయపడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై కంటతడి పెట్టిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు చెబుతున్నారు. జరిగిన ఉదంతంపై సీరియస్ గా ఉన్న ఆయన.. తొక్కిసలాట సందర్భంగా పడిన మచ్చను తుడిచేసుకునేందుకు ఏం చేయాలన్న ఆలోచన తీవ్రంగా చేస్తున్నట్లు చెబుతున్నారు.
నష్ట నివారణలోభాగంగా.. పుష్కరాలు అయ్యే వరకూ రాజమండ్రిలోనే తాను ఉంటానని ప్రకటించిన చంద్రబాబు.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా అధికారుల్ని వెంట పెట్టుకొని.. పుష్కర ఘాట్లను పరిశీలించటం గమనార్హం. రాజమండ్రిలోని పలు పుష్కర ఘాట్లను స్వయంగా పరిశీలిస్తూ.. అధికారులు చేపట్టాల్సిన చర్యల్ని చెబుతున్నారు. అంతేకాదు.. భక్తులకు అన్నీ పుష్కర ఘాట్లలో స్నానాలు చేయొచ్చు అంటూ చెబుతూ.. భక్తులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాదు.. తొక్కిసలాటపై స్పందించిన ఆయన.. పొరపాట్లు జరిగిన దానికి తనను క్షమించాలని భక్తుల్ని వేడుకున్నారు. భారీగా భక్తులు మృతి చెందటంతో.. గోదావరి పుష్కరాలపై మరింత దృష్టి పెట్టాలని.. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. చేతులు కాలిపోయిన తర్వాత ఎన్ని ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఉంటుందా..?