Begin typing your search above and press return to search.

మీ సేవ లో విరాళమిచ్చే సదుపాయం ఉండాలి!

By:  Tupaki Desk   |   16 Oct 2015 4:05 AM GMT
మీ సేవ లో విరాళమిచ్చే సదుపాయం ఉండాలి!
X
కిట్టనివారు ఎలాగైనా విమర్శలు చేయవచ్చు గాక. ఎన్ని వక్ర కారణాలు అయినా వెతకవచ్చు గాక.. కానీ రాజధాని నిర్మాణానికి ఎంతో కొంత విరాళం ఇవ్వడం అనేది ప్రజలకు సంబంధించినంత వరకు ఒక ఎమోషన్‌ అని అనుకోవాలి. రాష్ట్రంలోని ఒక వ్యక్తి ఒక ఇటుక ఇచ్చాడా.. లక్ష ఇటుకలకు పది లక్షల రూపాయలు చదివించుకున్నాడా అనేది ఇక్కడ ప్రయారిటీ కాదు.. సంపద ఎవరి వద్ద ఎలా తులతూగుతూ ఉంటే.. అలా వారు డొనేషన్లు ఇచ్చుకుంటారు. అయితే.. అంతే తప్ప చంద్రబాబు ఎవ్వరినీ మీరు ఇంతే ఇవ్వాలని బలవంతం చేయడంలేదు.

ప్రతి మనిషీ కనీసం ఒక్క ఇటుకనైనా కొనండి అని ఆయన అంటున్నారు. నిజానికి చంద్రబాబు కోరుతున్న ప్రకారం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒక్కొక్క ఇటును కొంటే ప్రభుత్వానికి వచ్చేది 50 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ద్వారా ఈ రాజధాని నిర్మాణానికి జరుగుతున్న ఖర్చులో అది వెయ్యో వంతు కూడా ఉండదన్నది స్పష్టం. అయితే.. మరో విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

ప్రజల నుంచి విరాళాలు సేకరించడం అనేది డబ్బు కోసం... రాష్ట్రంలోని ప్రతి ఒక్కడికీ కూడా తన రాష్ట్ర రాజధాని గురించి ఒక భావోద్వేగాల అనుబంధాన్ని క్రియేట్‌ చేయడం కోసం మాత్రమే అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రతి పౌరుడు పదిరూపాయలు ఇస్తే చాలు.. ఈ రాజధానిలో నా వాటా కూడా ఉన్నదనే ఫీలింగు వస్తుందని అంటున్నారు.

అయితే చంద్రబాబు మరో పనిచేయాల్సి ఉంది. కేవలం ఆన్‌ లైన్‌ అంటే చాలా మందికి వీలుపడకపోవచ్చు. చిన్న ఊర్లలో కూడా అందుబాటులో ఉండే మీ సేవ ద్వారా ఇవ్వమని చెబితే గ్రామీణులు కూడా విరాళాలు ఇస్తారు. అయితే విరాళాలకు మీసేవ సెంటర్లలో ఫీజులు తీసుకోకుండా.. ఇలా ఇవ్వమంటే.. కనీసం కొన్ని కోట్ల మంది నుంచి అయినా పాజిటివ్‌ స్పందన వస్తుంది.