Begin typing your search above and press return to search.
బక్కోళ్ల మీద ఈ ప్రతాపమేంది చంద్రబాబు?
By: Tupaki Desk | 24 Dec 2015 4:06 AM GMTమంత్రులు మాట వినకున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. సొంత ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నా సర్లే అన్నట్లు వ్యవహరిస్తారు. ఇక.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా లైట్ తీసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న ఏపీ అధికారపక్షం తాజాగా తీసుకున్న నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన నాటి నుంచి అందరిని కలుపుకుపోవటం.. సామరస్యంగా వ్యవహరించటం.. ఎవరి మనసుల్ని నొప్పించేందుకు ఇష్టపడకుండా.. తనకు తానే కష్టాలు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. బక్క ప్రాణాల మీద తన ప్రతాపం చూపించారన్న విమర్శల్ని మూటగట్టుకున్నారు. ఈ నెల 18న విజయవాడలో ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను విధుల నుంచి తప్పిస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి తాజాగా ఆదేశాలు జారీ చేయటం సంచలనం సృష్టిస్తోంది.
పార్టీలో ముఖ్య నేతలు మొదలు అధికారుల వరకూ అందరితోనూ సామరస్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమ పెండింగ్ సమస్యలపై గళం విప్పిన అంగన్ వాడీలపై కన్నెర్ర చేయటం కలకలం రేపుతోంది. అందరి తప్పుల్ని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు ఆందోళన జరపటంపై ప్రభుత్వం ఇంత తీవ్రంగా స్పందించటంపై అంగన్ వాడీలు విస్తుపోతున్నాయి.
తమ డిమాండ్ల సాధన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్ వాడీలపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. నిరసన సందర్భంగా సీఎం కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన అంగన్ వాడీలపై పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. వారిని నిలువరించం కోసం ఇష్టారాజ్యంగా లాఠీ ఛార్జ్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నిరసనలో పాల్గొన్న అంగన్ వాడీలపై వేటు వేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం షాకింగ్ గా మారింది.
ఎంతకూ పరిష్కారం కాని తమ డిమాండ్ల విషయంలో ఆయా సంఘాలు గళం విప్పటం మామూలే. అయితే.. ఎవరి విషయంలోనూ సీరియస్ కాని చంద్రబాబు.. తమపై ఇంత దారుణ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని అంగన్ వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దికాలంగా తమకు జీతాలు రావటం లేదని.. తమ సమస్యల్ని పరిష్కరించాలని ఎంత ప్రయత్నించినా పట్టించుకోని ప్రభుత్వం.. నిరసన తెలిపినందుకు వేటు వేయటం ఏమిటంటూ నిలదీస్తున్నారు. తమ సమస్యల్ని తొలుతే పరిష్కరించి ఉంటే తాము నిరసన తెలిపే వరకూ విషయం వెళ్లేది కాదు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బక్కజీవులైన అంగన్ వాడీలుపై బాబు సర్కారు కర్కశంగా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది. అంగన్ వాడీలపై బాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మరిన్ని ఆందోళనలకు కారణమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.