Begin typing your search above and press return to search.

ఏంది త‌మ్ముళ్లు.. బాబును అలా బుక్ చేస్తారేం?

By:  Tupaki Desk   |   6 Jun 2018 4:53 AM GMT
ఏంది త‌మ్ముళ్లు.. బాబును అలా బుక్ చేస్తారేం?
X
ప్ర‌జ‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇమేజ్ ఎంత ఉంద‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేసింది కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌. కోన‌సీమ కేంద్ర‌మైన అమ‌లాపురంలో నిర్వ‌హించిన న‌వ నిర్మాణ దీక్ష సంద‌ర్భంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు బాబును ఇబ్బందుల‌కు గురి చేశాయి. త‌మ్ముళ్ల స‌మ‌న్వ‌య లోపం పుణ్య‌మా అని.. జ‌నాలు పెద్ద‌గా రాక‌పోవ‌టం.. వ‌చ్చిన జ‌నాల మ‌ధ్య వీరావేశం తెచ్చుకొని ప్ర‌సంగించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌టం బాబును నిరాశ‌కు గురి చేసింద‌ని చెబుతున్నారు.

ఆల‌స్యంగా రావ‌టం అల‌వాటైన ముఖ్య‌మంత్రి అమ‌లాపురం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మాత్రం చెప్పిన టైంకి కేవ‌లం ప‌ది నిమిషాల ఆల‌స్యంగా మాత్ర‌మే వ‌చ్చారు. ఎప్పుడూ ఇది సుమారు గంట‌కు పైనే ఉంటుంది. అలాంటిది ఈసారి మాత్రం త‌న రెగ్యుల‌ర్ టైమింగ్‌కు భిన్నంగా వ‌చ్చారు.

ఇరుకు వీధుల్లో బాబు ప‌ర్య‌ట‌న‌లా ఉండేలా ప్లాన్ చేసిన తెలుగు త‌మ్ముళ్లు.. ఏ మాత్రం జ‌నం వ‌చ్చినా వీధుల‌న్నీ కిక్కిరిసిన‌ట్లుగా క‌నిపిస్తాయి. అయితే.. త‌మ్ముళ్ల ఆలోచ‌న‌లు బెడిసి కొట్టింది. దారి ఇరుకుగా ఉండ‌టంతో బాబు భ‌ద్ర‌త‌కు వ‌చ్చిన పోలీసులు ఇబ్బంది ప‌డ్డారు. కొన్నిచోట్ల చిన్న‌పాటి తొక్కిస‌లాట చోటు చేసుకుంది. త‌మ్ముళ్ల ఆలోచ‌న‌ల్ని గుర్తించ‌ని బాబు.. ఈ తీరుకు చిరాకు ప‌డ్డారు. స‌రిగ్గా ఏర్పాట్లు చేయ‌టం కూడా రాదంటూ త‌మ్ముళ్ల‌కు క్లాస్ పీకారు.

దాదాపు ఏడున్న‌ర గంట‌ల పాటు సాగిన అమ‌లాపురం ప‌ర్య‌ట‌న‌లో త‌మ్ముళ్ల ఏర్పాట్ల‌పై బాహాటంగానే అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఆర్గ‌నైజ్ చేయ‌టం రావ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌టం.. రోడ్ల‌ను చ‌క్క‌గా వేయించ‌టం లాంటి వాటికి లోటు లేకుండా చేసిన‌ప్ప‌టికీ.. అతి ముఖ్య‌మైన జ‌న‌సమీక‌ర‌ణ విష‌యంలో త‌ప్పులో కాలేయ‌టంతో.. ముఖ్య‌మంత్రి కార్య‌క్ర‌మంలో జ‌నాలు పెద్ద‌గా లేని వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది.

ఇక‌.. హాజ‌రైన వారు సైతం బాబు మాట‌ల‌కు రియాక్ట్ కాక‌పోవటం.. ఆయ‌న చెప్పే మాట‌ల‌కు ద‌న్నుగా చ‌ప్ప‌ట్లు కొట్ట‌టం లాంట‌వి లేక‌పోవ‌టంతో బాబుకు ఇబ్బందిగా మారింది. కొన్ని సంద‌ర్భాల్లో అయితే.. ఆయ‌న‌కు ఆయ‌నే చ‌ప్ప‌ట్లు కొట్టాల్సిందిగా కోర‌టం క‌నిపించింది. బాబు స‌భ‌కు వ‌చ్చిన వారిలో ఎక్కువ‌మంది డ్వాక్రామ‌హిళ‌లు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉండ‌టం క‌నిపించింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 ఎంపీ సీట్లు ఇప్పించి త‌న‌ను ఆశీర్వ‌దించాలంటూ బాబు చెప్పిన మాట‌కు స్పంద‌న రాలేదు. క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించింది మ‌న‌మేనంటూ గొప్ప‌లు చెప్పిన బాబు మాట‌కు జ‌నాల నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. వైఎస్సార్ కాంగ్రెస్‌.. బీజేపీలు రెండు క‌లిసి ప‌ని చేస్తున్నాయంటూ ఆరోప‌ణ చేసి..తాను చెప్పింది నిజ‌మ‌ని న‌మ్మితే చేతులు ఎత్తాలంటూ బాబు కోరినా.. పెద్ద‌గా చేతులు ఎత్త‌లేదు.

దీన్ని చూస్తే.. బాబు మాట‌ల్ని ప్ర‌జ‌లు ఎంత న‌మ్ముతున్నార‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలా చ‌ప్ప‌గా సాగిన అమ‌లాపురం ప‌ర్య‌ట‌న బాబుకే కాదు.. త‌మ్ముళ్ల‌కు సైతం నీర‌సం ఆవ‌హించేలా చేసింది. బాబు ప‌ర్య‌ట‌న‌కు భారీగా జ‌నాల్ని స‌మీక‌రించాల‌న్న పాయింట్‌ను మిస్ అయిన త‌మ్ముళ్ల పుణ్య‌మా అని.. బాబు అడ్డంఅడ్డంగా బుక్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.