Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు కూడా తెలియదట
By: Tupaki Desk | 19 Nov 2015 6:17 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నవారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరిపిన నేత.. ఎంతో అనుభవం ఉండడంతో పాటు సమాజాన్ని దగ్గర నుంచి చూసినవారు. ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు. తాజాగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. 'ఇలాంటి వర్షం నేనెప్పుడూ చూడలేదు' అని ఆయన ఆశ్చర్యపోయారు.
నెల్లూరు - చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టుప్రాంతాలను హెలికాప్టర్ నుంచి ఆయన వీక్షించారు. ఏరియల్ సర్వే ముగిసిన తరువాత రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షంపై చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వర్షం తన జీవితంలోనే ఎపుడూ చూడలేదని ఆయన అనడం గమనార్హం.
కాగా వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా అతలాకుతలమైపోయింది. వందలాది చెరువులు తెగిపోయాయి. రోడ్లు కట్ అయ్యాయి. ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. ఈ నష్టంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయకుడు కూడా ప్రధానికి వివరించారు. అయితే... వర్షసూచన తెలియడంతో ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం, జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం బాగా తగ్గింది.