Begin typing your search above and press return to search.

మోడీతో మీటింగ్ గురించి బాబేమ‌న్నారు?

By:  Tupaki Desk   |   25 Aug 2015 1:39 PM GMT
మోడీతో మీటింగ్ గురించి బాబేమ‌న్నారు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిలో మార్పు వ‌చ్చింది. ఎన్నోఏళ్లుగా ఉన్న ఆయ‌న అల‌వాట్లల‌లో కొన్నింటిని స‌మూలంగా మార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.మ‌రి.. ఉన్న‌ట్లుండి ఆయ‌న‌లో మార్పుకు కార‌ణం ఏమిటో స్ప‌ష్టంగా తెలియ‌కున్నా.. ఆయ‌న బాడీలాంగ్వేజ్‌.. మీడియాతో ఆయ‌న మాట్లాడుతున్న విధానంలో మాత్రం తేడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. మీడియా మైకు క‌నిపిస్తే చాలు.. చెల‌రేగిపోయే చంద్ర‌బాబు ఆచితూచి మాట్లాడ‌టం క‌నిపిస్తోంది. మంగ‌ళ‌వారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చూస్తే.. మీడియా క‌నిపించిన వెంట‌నే ప‌ర‌వ‌శించిన‌పోయిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. చాలాసేపు మాట్లాడే చంద్ర‌బాబు.. అందుకు భిన్న‌మైన విధానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ప్ర‌ధాని నివాసం బ‌య‌ట‌.. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. చంద్ర‌బాబును మాట్లాడాల‌ని మీడియా కోర‌గా.. సున్నితంగా వ‌ద్ద‌ని చెబుతూ.. మ‌ధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం క‌దా.. అక్క‌డ మాట్లాడ‌తాన‌ని చెప్పి వెళ్లిపోయారు. ఇలాంటి వైఖ‌రి చంద్ర‌బాబులో అస్స‌లు క‌నిపించ‌దు. అంతేకాదు.. మీడియా స‌మావేశాన్ని సైతం.. చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ముగించి వేయ‌టం క‌నిపించింది. ప్ర‌ధాని మోడీతో దాదాపు గంట‌న్న‌ర‌కు పైనే మాట్లాడిన నేప‌థ్యంలో.. మీడియాతో న‌ల‌భై నుంచి గంట మినిమం మాట్లాడే చంద్ర‌బాబు అందుకు భిన్నంగా చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ముగించేయ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు చెప్పిన మాట‌లు చూస్తే..

+ రాష్ట్ర విభ‌జ‌న గురించి.. దాని కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు వ‌చ్చిన ఇబ్బందులు.. విభ‌జ‌న కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ అనుస‌రించిన విధానాల‌న్నీ ప్ర‌ధానితో చెప్పా.

+ నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ రాజ్య‌స‌భ‌లో ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై ఇచ్చిన స్టేట్ మెంట్ ను ప్ర‌ధాని మోడీకి చ‌దివి వినిపించా.

+ ఏపీకి కావాల్సిన అన్నీ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కారం చేస్తాన‌ని మ‌న్మోహ‌న్ చెప్పార‌ని.. బుందేల్‌ ఖండ్ త‌ర‌హా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని అప్పుడు చెప్పార‌ని మోడీకి తెలిపా.

+ హైద‌రాబాద్‌ లో జ‌రిగిన అవ‌మానాల‌న్నీ వెల్ల‌డించా.

+ హైద‌రాబాద్ ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని కానీ.. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అన్ని విష‌యాలు ప్ర‌ధానితో చెప్పా.

+ ఉమ్మ‌డిరాజ‌ధానిలో అధికారులు అవ‌మానిస్తున్నారు. సెక్ష‌న్ 8 చ‌ట్టంలో ఉంది. దాన్నే అమ‌లు చేయాల‌ని మోడీని కోరా.

+ ఏపీకి ఆర్థిక లోటు కింద రూ.2,700కోట్లు.. వెనుక‌బ‌డిన ఏడు జిల్లాల‌కు రూ.350కోట్లు.. రాజ‌ధాని నిర్మాణానికి రూ.1500కోట్లు.. పోల‌వ‌రం ప్రాజెక్టు కింద రూ.250కోట్లు మాత్రమే ఇచ్చారు.

+ ఐఐటీ.. ఐఐఎం.. ట్రిఫుల్ ఐటీ.. ఎన్ ఐటీ.. ఎన్ ఐడీఎం.. క‌స్ట‌మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూష‌న్ కు 24 శాతం నిధులు ఇచ్చారు.

+ ప్ర‌త్యేక హోదా ఎలా అమలు చేయాలో కేంద్రం ఆలోచిస్తుంది.

+ ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధానికి అడిగితే.. అంత‌కు మించిన సాయం చేస్తాన‌ని చెప్పారు.

+ ప్ర‌త్యేక హోదా.. పారిశ్రామిక రాయితీలు ఒక‌టి కాద‌ని చెప్పా.

+ రాయ‌ల‌సీమ‌.. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు స్పెష‌ల్ ఇన్సెంటివ్స్ ఇస్తాన‌ని బిల్లులో చెప్పిన విష‌యాన్ని తెలియ‌జేశా.

+ కాశ్మీర్‌.. హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ ల‌కు ఇచ్చిన‌ట్లే ప్యాకేజీ ఇవ్వాల‌ని ప్ర‌ధానిని కోరా.

+ ప్ర‌త్యేక హోదా కింద 90 శాతం గ్రాంటు.. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోర‌గా.. ఆ అంశాల గురించి ప‌రిశీలిస్తాన‌ని మోడీ చెప్పారు.

+ రైల్వేజోన్‌.. పోల‌వ‌రం అంశాల్ని ప్ర‌ధాని వ‌ద్ద ప్ర‌స్తావించా.

+ క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. తెలంగాణ‌తో స‌మానంగా అభివృద్ధి చెందేవ‌ర‌కు ఏపీకి కేంద్రం సాయం చేయాల్సిందేన‌ని చెప్పా.

+ ప‌దో షెడ్యూల్‌ లోని సంస్థ‌ల విభ‌జ‌న‌.. విద్యుత్తు ఉద్యోగుల స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తున్న విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లా.

+ ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల గురించి వివ‌రంగా ప్ర‌ధానితో చ‌ర్చించా. ఆయ‌న సానుకూలంగా స్పందించారు.