Begin typing your search above and press return to search.
బాబు వైస్రాయ్ ఫార్ములా..! మళ్లీ తెరపైకి?
By: Tupaki Desk | 19 Feb 2019 3:30 PM GMTనమ్ముకున్న నేతలు టీడీపీ పట్టు జారిపోతున్నారు. నెలరోజుల్లోనే ఇద్దరు ఎంపీలు - ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడంతో సీన్ రివర్స్ అవుతోంది. ఈ పరిణామాలు టీడీపీ అధ్యక్షులు - ముఖ్యమంత్రి చంద్రబాబును కలవరపెడుతున్నాయట.. ఎటూతోచని దిక్కుతోచని స్థితిలో నిరాశా నిస్పృహల్లో టీడీపీ శిబిరం కొట్టుమిట్టాడుతోందట.. మరో 15 మంది టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారన్న సమాచారం చంద్రబాబును షేక్ చేస్తోందని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.. ఇప్పుడు అన్నీ పనులు మానేసి వారిని కాపాడుకునేందుకు అధినేత తంటాలు పడుతున్నట్టు టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఉండే నేతలకు ప్రజాభిప్రాయం గురించి తొందరగా తెలుస్తుంది. వచ్చేసారి ఏ పార్టీ గెలుస్తుందో అంచనావేస్తున్న నేతలు గెలిచే పార్టీకి జంప్ చేస్తున్నారు. అలానే చంద్రబాబుకు రాంరాం చెప్పి తాజాగా చాలా మంది నేతలు వైసీపీలో చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మొదలుకుని - చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ - ఎంపీలు అవంతి శ్రీనివాస్ - పండుల రవీంద్రబాబు వరుసగా జగన్ కు జైకొట్టి వైఎస్సార్సీపీకి క్యూ కట్టారు. టీడీపీలోని మిగతా ఎమ్మెల్యేలు - ఎంపీలు కూడా ఎందరు జారుకుంటారో - ఎప్పుడు పార్టీని వదిలేస్తారోనన్న దిగులు ఇప్పుడు చంద్రబాబును పట్టిపీడిస్తోందని సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గతంలో మామ ఎన్టీఆర్ పై ప్రయోగించిన అస్త్రాన్నే మరోసారి దుమ్మదులిపి బయటకు తీయబోతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గద్దె దింపేసినప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు ‘వైస్రాయ్’ హోటల్ లో వారిని పెట్టి రాజకీయం చేశారు. ఆ వ్యూహాన్నే ఇప్పుడు మరోసారి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
గతంలో హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను నిర్బంధించి ఉంచుకున్నట్టే.. ఇప్పుడు కూడా వారిని తనతో అట్టిపెట్టుకోవాలని - కోట్లు కుమ్మరించి కావాల్సిన తాయిలాలన్నీ అందించి కాపాడుకోవడానికి బాబు రెడీ అయ్యారని టీడీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. జారుకునే ఆస్కారం ఉన్న ఎమ్మెల్యేలు - ఎంపీలపై పకడ్బందీగా నిఘా పెట్టాలని యోచిస్తున్నారు. వారు ఎవరితో మాట్లాడకుండా చూసేందుకు ఓ వ్యవస్థను - యంత్రాగాన్ని ఏర్పాటు చేస్తున్నారట.. ఎప్పటికప్పుడు ఫోన్ల ట్యాపింగ్ కు కూడా చేసేలా బాబు స్కెచ్ గీసినట్టు సమాచారం..
ఇప్పటికే - జగన్ పార్టీ వైపు చూస్తున్న వారిని నయానో భయానో.. తనతోనే ఉండేలా - ఒప్పించేందుకు తన అనుచరులను బాబు రంగంలోకి దించాడట. జగన్ సంబంధీకులు వారితో మాట్లాడకుండా చూడాలని స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చాడని చెబుతున్నారు. తన వ్యూహంలో భాగంగానే కొద్ది కాలంగా అంటీ ముట్టనట్లుగా ఉంటున్న తోట త్రిమూర్తులను తన వద్దకు పిలుచుకుని బాబు బుజ్జగించినట్టు సమాచారం.. ఇప్పటికే చాలా ఆలస్యమైనప్పటికీ - మిగిలిన వారిని కూడా ఇలానే పిలిచి బేరసారాలు చేయాలనుకుంటున్న పార్టీలో చర్చ జరుగుతోంది. మరి బాబు ‘వైస్రాయ్’ ఫార్ములా ప్రయత్నాలు ఫలిస్తాయా లేక దింపుడు కళ్లెం ఆశలుగా మారతాయో వేచి చూడాల్సిందే!