Begin typing your search above and press return to search.
చేతులు కాలిన తర్వాత బాబు అఖిలపక్షం జపం
By: Tupaki Desk | 26 March 2018 6:48 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త మంత్రం తెరమీదకు తీసుకువచ్చారు. అన్నీ పార్టీలతో కలిసి పోరాడుదాం అంటూ కొత్త ఫార్ములా ప్రకటించారు. మంగళవారం అఖిల పక్షం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే బాబు కొత్త మంత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు బాబు ఫార్ములాకు కలిసి వచ్చేవారు ఎవరనేది ప్రశ్నగా ఉందంటున్నారు.
ఏపీకి చేసిన సహాయం, తాజాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎంపీలకు ఆర్డర్ వేశారు. మంగళవారం సభకు ఎంపీలు అందరూ విధిగా హాజరుకావాలని, అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టాలని, అవిశ్వాసం నోటీసులు అనేక పార్టీలు ఇచ్చాయని - టీడీపీ - వైసీపీతో పాటు కాంగ్రెస్ - సీపీఎం కూడా ఇచ్చాయని, ఈ నేపథ్యంలో లాటరీ ద్వారా అవిశ్వాసం చర్చకు చేపట్టే అవకాశం ఉందని, లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చని, ఏదేమైనా అవిశ్వాసంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం జాతీయస్థాయిలో వినిపించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎంపీలంతా ఈ రాత్రికే ఢిల్లీకి చేరుకోవాలని, పసుపు చొక్కాలు,కండువాలతో సభకు హాజరు కావాలని బాబు ఆర్డర్ వేశారు.
అవిశ్వాసంపై చర్చ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ఇది చాలా కీలక సమయమని - అవిశ్వాసంపై చర్చ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనదని, ఈ సందర్భాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాబు సూచించారు. అన్నిపార్టీల నేతలను కలిసి ఏపికి సహకారాన్ని కోరాలని, ఏపికి జరిగిన అన్యాయం గురించి వారికి వివరించాలని, మన వద్ద ఉన్న సమాచారం అంతా వారికివ్వాలని - టిఆరేఎస్ కూడా మనకు సహకరించేందుకు ముందుకొచ్చిందని - అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని - రాష్ట్రానికి న్యాయం చేయమని కోరాలని తెలిపారు.
ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాలు ఏర్పాటుచేశామని - ఢిల్లీలో ఒక బృందం - అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాలో బిజెపి దుష్ప్రచారాన్ని అధికం చేసిందని, రాష్ట్రంపై బురద జల్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనిపై ఎవరూ అధైర్యపడవద్దని, వెనుకంజ వేయరాదని, దీనివల్ల బీజేపీపైనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, టిడిపిపై మరింత సానుభూతి వస్తుందని, జాతీయ మీడియాను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, మన వద్దనున్న సమాచారం మీడియా ప్రతినిధులకు ఇవ్వాలని, జాతీయ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అన్నింటికి యూసిలు ఇచ్చాం కాబట్టే తరువాత విడత నిధులు ఇచ్చారని, యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు విడుదల చేయలేదనే బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదని దీనిని తిప్పికొట్టాలని బాబు సూచించారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నివేదికలోని అంశాలను వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఒంటరి చేయాలనే బిజెపి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.
అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రతీ పార్టీ తరపున ఇద్దరు రావాలని ఆహ్వానం పంపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో అన్నీ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలను కుడా ఆహ్వానిస్తున్నామని, అవిశ్వాసం అనంతరం తీసుకోవలిసిన చర్యలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకవేళ వెంటనే అఖిలపక్షం చర్చకు వస్తుందని లేదంటే పదిరోజుల్లో చర్చకు తేదీ నిర్ణయించవచ్చని బాబు ధీమా వ్యక్తం చేశారు.