Begin typing your search above and press return to search.

తను చేసిన చట్టాన్ని బాబే బ్రేక్ చేశారా?

By:  Tupaki Desk   |   20 Dec 2016 7:30 PM GMT
తను చేసిన చట్టాన్ని బాబే బ్రేక్ చేశారా?
X
నిత్యం తప్పుల్ని ఎత్తి చూపించే అధినేత తప్పులు చేస్తారా? పెద్దమనిషిగా వ్యవహరిస్తూ నోరు తెరిస్తే నీతులు చెప్పే పెద్ద మనిషి తనకు తాను తప్పులు చేసే అవకాశం ఉందా? అంటే.. లేదనే చెబుతారు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటి తప్పే చేశారని చెప్పటమే కాదు.. దానికి సాక్ష్యంగా ఆధారాల్ని చూపిస్తున్నారు. ఆరు నెలల కిందట ఏపీ సర్కారు ఒక జీవోను విడుదల చేసింది.

ఏడో నెలలో.. జీవో నెంబరు 340 పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల సారాంశం ఏమిటంటే.. ఏపీ అసెంబ్లీలో ఏదైనా రాజకీయ పార్టీకి మొత్తం ఎమ్మెల్యేల్లో 25 శాతం కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉంటే.. వారికి జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఇవ్వాల్సిన స్థలం అక్షరాల 30 గజాలు మాత్రమే. కానీ.. తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ లో చేసిన తీర్మానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. విశాఖపట్నంలో బీజేపీకి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఏకంగా 400 గజాల స్థలాన్ని కేటాయించారు.

ఒక రాజకీయ పార్టీకి ఎంత భూమి కేటాయించాలన్న విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోకపోతే.. అసలిప్పుడు చర్చే ఉండేది కాదు. కానీ.. ఒకవైపు జీవో జారీ చేసి మరీ.. దాన్ని ఉల్లంఘిస్తూ.. పెద్ద ఎత్తున స్థలాన్ని తన మిత్రపక్షానికి కేటాయించటంపై పలువురు విమర్శిస్తున్నారు. తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు.. జీవోలు విడుదల చేయాల్సిన అవసరమే లేదు. కానీ.. జీవోలు విడుదల చేసి.. పరిమితులు నిర్దేశించుకున్నాక.. వాటిని ఉల్లంఘిస్తూ నిర్ణయం తీసుకోవటంలోనే అభ్యంతరమంతా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/