Begin typing your search above and press return to search.

మరో వీడియో సంచలనంగా మారింది.. బాబు.. ఆర్కే వీడియో

By:  Tupaki Desk   |   8 April 2019 6:07 AM GMT
మరో వీడియో సంచలనంగా మారింది.. బాబు.. ఆర్కే వీడియో
X
ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తుందన్న వేళ.. రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటివరకూ సాగుతున్న ప్రచారాలు.. లీకైన ఆడియో.. వీడియోలకు భిన్నంగా తాజాగా బయటకు వచ్చి.. వైరల్ అవుతున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.

ఎన్టీఆర్ పేరును సంక్షేమ పథకాల నుంచి తొలగించటం లాంటి కఠిన వాస్తవాలతో పాటు.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహాలు ఇస్తున్న వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ క్లిప్ లో ఏముందన్న విషయానికి వస్తే.. దాని గురించి చెప్పే కన్నా.. వీడియోలో ఉన్న అంశాల్ని యథాతధంగా అక్షర రూపం ఇచ్చేస్తే..

చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం....

రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్‌ వర్క్‌ ఎవరూ చేయలేదు.

చంద్రబాబు : దానిని మిస్‌ యూజ్‌ చేశారు.

రాధాకృష్ణ : ఫస్ట్‌ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్‌ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్‌ లైక్స్‌ రావాలి.

రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్‌.

చంద్రబాబు : వ్యూయర్‌షిప్‌లో మనది ఎంత?

రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం

టెక్నికల్‌ టీమ్‌: (చంద్రబాబుతో) వైజాగ్‌ ఇంకో సిటీని కలిపాం సార్‌

చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా?

రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు.

చంద్రబాబు : నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్‌ చేయి.

రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా.

వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్‌.

రాధాకృష్ణ :ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు?

చంద్రబాబు : పేరు మార్చాలి.. మారుస్తున్నా..

రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌ గా రీవ్యాంప్‌ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.

చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది

రాధాకృష్ణ : ఆ ఓకే.

చంద్రబాబు : ఎన్టీఆర్‌... పేరు మార్చాలి.

రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్‌ చేద్దాం.

ఈలోగా టెక్నికల్‌ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి. వైజాగ్‌ లో ఏమి పెట్టారు. వైజాగ్‌లో ఎల్ఈడీ...తదితర అంశాలున్నాయి.