Begin typing your search above and press return to search.
పతంజలికి కారు చౌకగా భూములిచ్చేశారుగా!
By: Tupaki Desk | 1 March 2017 9:28 AM GMTఅత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందానా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారా?. ఈ వ్యవహారాల్లో నలు దిక్కులా విమర్శలు వినిపిస్తున్నా కూడా బాబు సర్కారు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదా?. అధికారుల నివేదికలను బుట్టదాఖలు చేస్తూ కారు చౌకగా ఆయా భూములను ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను తమకిష్టమైన సంస్థలకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు... తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కు ఏకంగా 172.84 ఎకరాలను ధారాదత్తం చేసేసిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్న వాదన కూడా వినిపిస్తోంది. అది కూడా సదరు భూమి ఉన్న జిల్లాకు చెందిన కలెక్టర్ ఓ ధరను నిర్ణయించగా, అందులో పావలా వంతు ధరకే ఈ భూములను పతంజలికి కట్టబెట్టడం గమనార్హం.
ఈ వ్యవహారానికి సంబందించిన వ్యవహారాల్లోకి వెళితే... పతంజలి సంస్థ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పంపింది. ఆయుర్వేద ఉత్పత్తులతో కూడిన ఈ ప్రాజెక్టుతో 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం పతంజలి సంస్థకు అవసరమైన భూమిని ఎంపిక చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పతంజలి సంస్థకు ఇవ్వదలచిన భూమికి ధర నిర్ణయం బాధ్యతను కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కే అప్పజెప్పింది. ఈ నేపథ్యంలోజిల్లాలోని కొత్తవలస మండలం చిన్నారావుపల్లికి చెందిన 172.84 ఎకరాలను జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఎకరాకు రూ.9.62 లక్షల చొప్పున పతంజలి సంస్థకు భూమిని అప్పగించాలని కూడా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం... ఎకరం రూ.3 లక్షల చొప్పున పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌కు 172.84 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో ఇచ్చింది. కలెక్టర్ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ భూమిని ఎకరానికి రూ.9.62 లక్షలకు విక్రయించాలని ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎకరానికి రూ.3 లక్షలకే ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. పతంజలికి ఇచ్చే భూమిలో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూమి ఉంది. అసైన్డ్ భూమికి రైతుకు కలెక్టర్ నిర్ణయించిన ధర చెల్లిస్తారు. ఈ మేరకు పతంజలి ఇచ్చే రూ.3 లక్షలు పోను, మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ కార్యదర్శి బి.శ్రీధర్ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.