Begin typing your search above and press return to search.

మైలేజ్ కోసం భార్యతో రోడ్డునపడ్డ చంద్రబాబు..!

By:  Tupaki Desk   |   1 Jan 2020 2:15 PM GMT
మైలేజ్ కోసం భార్యతో రోడ్డునపడ్డ చంద్రబాబు..!
X
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన గండరగండరుడు లేడని రాజకీయవర్గాల్లో చర్చ ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ బలమైన తెలుగు మీడియా ఆయన చేతిలోనే ఉంది.ఇక 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కేసులు కాకుండా తప్పించుకున్న నేర్పరి తనం ఆయన సొంతమంటారు. అడ్డంగా దొరికిన ‘ఓటుకు నోటు’ కేసు కూడా అతీగతీ లేకుండా పోయింది.. అలాంటి బాబుకు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని అంటారు.

తాజాగా అమరావతిలో నూతన సంవత్సరం వేళ బాబు గారు తొలిసారి తన భార్య భువనేశ్వరిని రోడ్డుమీదకు తీసుకొచ్చాడు. తన పత్ని భువనేశ్వరితో కలిసి సకుటుంబ సపరివారంగా అమరావతి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాడు. జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అన్నారు.

తనకు రాజకీయ మైలేజ్ నిచ్చే ఏ సమస్యనైనా తెలివిగా వాడుకోవడంలో చంద్రబాబును మించి నేత లేరంటారు.అందుకే 40 ఏళ్లుగా బాబు రాజకీయంలో ఉన్నా ఆయన భార్య భువనేశ్వరి వ్యాపారాలకే పరిమితమయ్యారు తప్పితే బాబుతోపాటు రాజకీయాలు చేయేలేదు. తాజాగా అమరావతిలో మహిళల ఆందోళనల్లో భార్యను తీసుకొచ్చి చంద్రబాబు సెంటిమెంట్ రాజేశారు.

తన భర్త చంద్రబాబు సొంత కుటుంబాన్ని విస్మరించి ప్రజల కోసం పాటుపడుతున్నాడని.. మీకు అండగా ఉంటాడని భువనేశ్వరి అన్న మాటలు ఆందోళనలు చేస్తున్న మహిళలను కదిలించాయి. ఇలా బాబు గారు రాజకీయం కోసం భార్యను తీసుకొచ్చి అమరావతిలో మహిళా ఆందోళనకారులను సంతృప్తిపరిచిన తీరు చూసి అందరూ ముక్కునవేలేసుకున్నారు.బాబు గారి బుర్రే బుర్ర అంటూ ఆశ్చర్యపోయారట..