Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం అడిగారు..సీఎస్ నో ప్రాబ్లం అన్నారు
By: Tupaki Desk | 11 Aug 2015 4:57 AM GMTఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరొకరు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే వీరిద్దరికి ఏం కావాలన్నా క్షణాల్లో సమకూరుతాయి. సగటు ఉద్యోగికి ఉండే ఈతి బాధలేవీ వీరికి ఉండవు. అందుకేనేమో.. ఉరుము.. మెరుపు లేకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీలో ఉండాలనిపించటం.. ఆ వెంటనే నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది.
మొన్నటివరకూ హైదరాబాద్ వదిలి పెట్టి రావటానికి సముఖంగా లేని బాబు.. ఇప్పుడు మాత్రం ఏపీలోనే ఉంటానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆయన.. వారానికి ఐదు రోజులు ఏపీలోనే ఉంటానని.. మీ సంగతేమిటంటూ సీఎస్ ఐవిఆర్ కృష్ణారావును అడిగారు. ఆయన దానికి వెంటనే బదులిస్తూ.. వారం రోజులు ఉండటానికి తనకు అభ్యంతరం లేదని గొప్పలు చెప్పారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. సీఎస్ అనుకోవటంతోనే సరిపోతుందా? కొన్ని వేల కుటుంబాలు ప్రభావితమయ్యే ఇలాంటి చర్యల్ని క్రమపద్ధతిన జరగాల్సి ఉన్నా అదేమీ లేకుండా.. లేడికి లేచిందే పరుగు అన్న తీరులో వ్యవహరించటం బాబుకే చెల్లింది. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఇంతకాలం హైదరాబాద్ లోనే ఎందుకున్నారనటానికి ప్రత్యేక కారణం చెప్పరు. ఉన్నట్లుండి.. విజయవాడకు షిఫ్ట్ అయిపోవాలన్న ఆలోచనను అమలు చేయటానికి వెనుకాడటం లేదు.
ఒక ముఖ్యమంత్రి.. ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఉండకపోవచ్చేమో. కానీ.. సగటు ఉద్యోగి పరిస్థితేంది? వారికుంటే కుటుంబ సమస్యల మాటేమిటి? పిల్లల చదువులు.. ఇబ్బందులెన్నో ఉంటాయి. వాటికి సంబంధించి ముందస్తుగానే స్పష్టమైన ప్రకటన చేసి.. విధివిధానాలు రూపొందించి.. క్రమపద్ధతిలో(వేగంగా అయినా సరే) చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటికి హైదరాబాద్ విడిచి వెళ్లటానికి ఇబ్బంది పడితే దానికి ఎవరూ ఏమీ చేయలేరు.
కానీ.. అలాంటిదేమీ లేకుండా ఆకస్మాత్తుగా.. అది ఆగస్టు నెలలో ఏపీకి వెళ్లిపోవాలన్న నిర్ణయం తీసుకోవటం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. పిల్లల చదవులు మధ్యలో ఉండటం పెద్ద కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. యుద్ధ ప్రాతిపదికన.. విజయవాడ సమీపంలో ఒక టౌన్ షిప్ ను నిర్మించే అంశంపై దృష్టి పెడితే చాలా సమస్యలకు పరిష్కారంగా ఉండేది.
గోదావరి పుష్కరాల కోసం దాదాపు రూ.1600కోట్ల నిధుల్ని ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. పుష్కర పనులు.. వసతులు పరిశీలించినప్పుడు.. నిధుల దుర్వినియోగం ఎంత భారీగా సాగిందో ఇట్టే తెలిసిపోయే పరిస్థితి. పుష్కరాల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన ఏపీ సర్కారు.. దూరదృష్టిలో ఉద్యోగుల అవసరాల కోసం టౌన్ షిప్ లాంటి వాటి మీద దృష్టి పెడితే.. ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలకు సంబంధించి చాలా ఇబ్బందులు తీరి ఉండటంతో పాటు.. విజయవాడ నగరం మరింత విసృతి అయ్యేది.
కానీ.. అలాంటివేమీ చేయకుండా.. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వదిలి పెట్టాలని బాబు తీసుకున్న నిర్ణయం.. సెక్రటేరియట్ లోనూ.. హైదరాబాద్ లోని ఏపీ క్యాడర్ లో పని చేసే ఎందరో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించటం ఖాయం. మరి.. దీనిపై ఏపీ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.