Begin typing your search above and press return to search.
గ్యాలరీ వాక్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ 'దేవాన్ష్'!
By: Tupaki Desk | 12 Sep 2018 11:50 AM GMT2018లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు పలు మార్లు నొక్కివక్కాణించిన సంగతి తెలిసిందే. అయితే, గత నాలుగేళ్లుగా పోలవరం విషయంలో నిర్లక్ష్యపూరిత వైఖరిని అవలంబించిన చంద్రబాబు.....ఆ ప్రాజెక్టు పనులలో 58శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక మిగిలిన 9నెలల కాలంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని గుర్తించిన చంద్రబాబు...కొంతకాలంగా తనదైన శైలిలో పబ్లిసిటీ కల్పించుకున్నారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును బాబుగారు.....మళ్లీ మళ్లీ జాతికి అంకితం చేస్తూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే , పోలవరం ప్రాజెక్టు ‘డయాఫ్రమ్ వాల్’ ( ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన పునాది) ని చంద్రబాబు జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. పోలవరం పూర్తయిన రోజు జాతికి అంకితమివ్వాల్సిన కార్యక్రమాన్ని ....పునాదుల నాడే బాబుగారు పూర్తిచేసి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. ఇంకా చెప్పాలంటే, ఓ జాతీయ ప్రాజెక్టు పునాదులను కూడా జాతికి అంకితం ఇచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇలా పునాదులకు....గోడలకు…కెనాల్స్ కు...డయాఫ్రమ్ వాల్స్ ను విడివిడిగా జాతికి అంకితం చేసి మీడియాను ఆకర్షించాలనుకుంటోన్న చంద్రబాబు తాజాగా మరో `మైలురాయి`ని చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు చేపట్టిన `గ్యాలరీ వాక్`....ఆయన పబ్లిసిటీ స్టంట్స్ ను పీక్స్ కు చేర్చింది.
ఆ గ్యాలరీ వాక్ లో సకుటుంబ సపరివార సమేతంగా చంద్రబాబు హాజరయ్యారు. బాబు సతీమణి భువనేశ్వరి - కుమారుడు నారా లోకేష్ - కోడలు బ్రాహ్మణి - మనవడు దేవాన్ష్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికితోడు, టీడీపీ ఎమ్మెల్యేలు సతీ సమేతంగా ఇక్కడకు విచ్చేశారు. వెరసి అదేదో పిక్నిక్ స్పాటో....వనభోజనాల చోటో అనిపించేలా తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, ఈ గ్యాలరీ వాక్ లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఎంట్రీ హైలైట్. మనవడిని చూసి తాత చంద్రబాబు మురిసిపోవడం...ఫొటోలకు ఫోజులివ్వడం కొసమెరుపు. ఇక, చంద్రబాబు కుటుంబ సభ్యుల దర్శన భాగ్యంకోసం తెలుగు తమ్ముళ్లు నానాపాట్లు పడ్డారు. మరోవైపు, ఈ గ్యాలరీ వాక్ కు చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా హాజరుకావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం నిధులివ్వడంలేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించడం..విష్ణుకుమార్ రాజు ఆ ఆరోపణల్ని ఖండించడం మరో ఘట్టం. ఇక, పట్టిసీమపై తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పిన విష్ణుకుమార్ రాజు....అదే నోటితో అదో అద్భుతమైన ప్రాజెక్ట్ అని కితాబివ్వడం విశేషం. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం గ్యాలరీ వాక్ కు తాను కేంద్రం తరఫున వచ్చానని, ప్రభుత్వం ఆహ్వానించిందని ఆయన సెలవిచ్చారు. ఏది ఏమైనా, పోలవరం దగ్గర మాత్రం మినీ మహానాడు రేంజ్ లో హడావిడి కనిపించడం విశేషం.