Begin typing your search above and press return to search.
ఏపీలో తొలిసారి - బాబు ఫ్యామిలీ ఓటు
By: Tupaki Desk | 11 April 2019 9:42 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాజధాని ప్రాంతమైన అమరావతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామంలో ఉన్న పోలింగ్ స్టేషన్ లో చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణీలతో కలిసి ఓటు వేశారు. అనంతరం చూపుడు వేలుకు సిరా గుర్తును మీడియాకు చూపించారు.
చంద్రబాబు, లోకేష్ లు మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.. ఇది రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు అని తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా భావించాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మరోసారి పోటికి దిగగా.. నారా లోకేష్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీచేస్తున్నారు.
2014లో హైదరాబాద్ లో ఓటేసిన చంద్రబాబు కుటుంబం ఈసారి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. 2014లో రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ విడిచి అమరావతి వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాజధాని నిర్మాణాన్ని చేపట్టారు. అందుకే ఈసారి ఏపీలో ఓటేశారు.