Begin typing your search above and press return to search.
సీమకు నిర్లక్ష్య శాపవిమోచనం ఎప్పటికి?2
By: Tupaki Desk | 29 Jan 2016 5:40 AM GMTస్మార్ సిటీల ఎంపిక విషయంలో పెట్టుకున్న విధి విధానాలు.. అనుసరించిన పద్ధతులన్నీ పక్కాగా ఉన్నాయనే చెప్పాలి. ఒకవేళ అలాంటిదే లేకుంటే ప్రధాని మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరం 90వ స్థానంలో నిలిచి ఉండేది కాదు. ఇన్విజిలేటర్ తప్పు లేదని తేలిపోయిందంటే.. తప్పంతా సబ్జెక్ట్ బోధించిన టీచర్ దే బాధ్యత. స్మార్ట్ సిటీల ఎంపికకు రూపొందించిన ప్రతిపాదనల విషయంలో తిరుపతి పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యమే తుది జాబితాలో చోటు దక్కకపోవటమే కాదు.. ర్యాంకుల విషయంలోనూ చాలా వెనుకబడి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి? అన్న ప్రశ్నలోకి వెళితే.. దీనికి ఇద్దరు ఏపీ మేధావులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే.. మరో మేధావి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విషాదకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. సీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు అధినేతలు ఉన్నా..తమ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవటంపై సీమ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. గతంలో తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. తర్వాత ఆరేళ్లు సీఎంగా ఉన్న వైఎస్.. రోశయ్య తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. విభజన తర్వాత గత 19 నెలలుగా సీఎంగా నిర్వహిస్తున్న చంద్రబాబు అందరూ సీమ ప్రాంతానికి చెందిన వారే అయినా.. సీమకు అన్యాయం జరుగుతూనే ఉంటోంది. పుట్టిన గడ్డను ప్రేమించే విషయంలో ఈ నేతలు నిజాయితీగా ఉండకపోవటమే సీమకు శాపంగా మారింది.
అదే రాయలసీమను మరింత వెనుకబాటుకు గురయ్యేలా చేస్తోంది. స్మార్ట్ సిటీ ఎంపిక విషయంలో జరుగుతున్న కసరత్తులో తిరుపతి విషయంలో మరికాస్త శ్రద్ధ ప్రదర్శించి ఉంటే.. ఆ పట్టణం 42 స్థానంలో ఉండేది కాదు. స్మార్ట్ సిటీల ఎంపికలో ఏపీ తరఫున ఎంపికైన రెండు పట్టణాల్లో ఒకటి టాప్ టెన్ జాబితాలో నిలిస్తే.. మరొకటి టాప్ ఫిఫ్టీన్ జాబితాలో ఉందన్న విషయం మర్చిపోకూడదు. అదే సమయంలో తిరుపతి దాదాపు 25 స్థానాలు వెనుకబడి ఉండటం గమనార్హం. సీమ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్టంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాకు చెందిన టెంపుల్ సిటీని స్మార్ట్ సిటీగా తెచ్చుకోలేకపోవటం చంద్రబాబు వైఫల్యం కాదా? అన్నది ఒక ప్రశ్న.
తనను తాను సమర్థుడిగా తరచూ చెప్పుకునే చంద్రబాబులో సమర్థత ఉండి ఉంటే.. స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతి పట్టణం ఎందుకు లేకుండా పోయింది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. అదే సమయంలో.. ఈ తప్పునకు విపక్ష నేత వైఎస్ జగన్ కూడా బాధ్యత వహించాల్సి ఉందన్న విషయం మర్చిపోకూడదు.
సీమ ప్రాంతానికి చెందిన జగన్ కానీ.. విపక్ష నేతగా తన పాత్రను నూటికి నూరుపాళ్లు నిర్వహించి ఉంటే.. అధికారపక్షం సీమ పట్ల ప్రదర్శించే నిర్లక్ష్యాన్ని ఆయన కడిగిపారేసేవారు. అదే జరిగి ఉంటే.. సీమ పట్ల మరికాస్త జాగ్రత్తతో చంద్రబాబు ఉండటంతో పాటు.. ఏపీ సర్కారు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండేది. అదే జరిగి ఉంటే.. సీమ ప్రాంతానికి చెందిన తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపికై ఉండేదనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. స్మార్ట్ సిటీలకు అవసరమైన ప్రతిపాదనలు ఎలా ఉండాలన్న విషయంపై ఏపీ సర్కారుకున్న పట్టు ఏమిటో.. విశాఖ.. కాకినాడల విషయంలో అర్థమైన నేపథ్యంలో.. తిరుపతి నివేదిక తయారీలో సీమ పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి.
మరింత దారుణ విషయం ఏమిటంటే..ఏపీ సర్కారు పంపిన తిరుపతి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని.. దాన్ని మార్చి వెనువెంటనే పంపితే.. తర్వాతి ఎంపికలో తిరుపతి పట్టనాన్ని ఉంచుతానని కేంద్రం పేర్కొనటం చూస్తే.. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వారికి టెంపుల్ సిటీ మీదున్న ప్రేమ.. రాష్ట్రంలోని సీమ బిడ్డలుగా చెప్పుకునే చంద్రబాబు.. వైఎస్ జగన్ కు లేదనిపించక మానదు. రాయలసీమ విషయంలో అధినేతలు ప్రదర్శించే నిర్లక్ష్యం చూసినప్పుడు చంద్రబాబు..జగన్ లు సీమ బిడ్డలేనా? అన్న డౌట్ వస్తుందంటూ సీమ వాసులు మండిపడే తీరులో ధర్మాగ్రహమే కనిపిస్తుంది తప్పించి..బరితెగింపు వ్యాఖ్యలుగా అనిపించవు.