Begin typing your search above and press return to search.
ఆ విషయంలో వైసీపీ - టీడీపీ ఒకటేనా?
By: Tupaki Desk | 8 July 2019 2:30 PM GMTతమిళనాడు కథ ఇదీ.. ఇక్కడ అయితే అన్నాడీఎంకే లేదంటే డీఎంకే.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీలను కలిసికట్టుగా బొందపెట్టిన ఈ పార్టీలు.. తమిళనాట వాటి జాతీయ పార్టీల ఉనికినే లేకుండా ప్రాంతీయ పార్టీలను కాపడుకోవడంలో విజయం సాధించారు. అందుకే కేసీఆర్ కూడా తెలంగాణలో తమిళ ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ - బీజేపీలను లేకుండా చేస్తానని ఇటీవలే ప్రకటించారు కూడా..
కానీ ఏపీ పరిస్థితే ఎటూ కాకుండా ఉంది. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను భయపెట్టి - కేసులను బూచీగా చూపి బీజేపీలోకి చేర్చుకున్నారన్న విమర్శలు చెలరేగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు టీడీపీని కబళించి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు వలసలను ప్రోత్సహిస్తోంది. త్రిపుర - సహా ఈశాన్య రాష్ట్రాల్లో అస్సలు 1శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీ.. ఇలానే అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలను లాగేసి ఏకంగా అధికారంలోకి వచ్చిన ఉదంతాలున్నాయి.
ఇక పశ్చిమబెంగాల్ లో ఉనికి లేని బీజేపీ ఈసారి 20 సీట్ల వరకు గెలుచుకొని ఔరా అనిపించింది. అక్కడి అధికార తృణమూల్ - ప్రతిపక్ష సీపీఐని నీరు గార్చి ఎదగాలనుకుంటోంది.
కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఉనికి లేని రాష్ట్రాల్లో ధృఢమైన ప్రాంతీయ పార్టీల నేతలను లాగేసి బలపడే స్కెచ్చుకు బీజేపీ తెరతీసింది.. తీస్తోంది. ఏపీ - తెలంగాణలో ఇదే స్కెచ్ తో ముందుకు వెళుతోంది.
అయితే ఏపీలోకి బీజేపీ ఎంట్రీ అటు చంద్రబాబు - ఇటు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరికీ ఇష్టం లేదు. బీజేపీ వన్స్ ఎంటర్ అయితే ఈ రెండు ప్రాంతీయ పార్టీలను కబళించడం ఖాయం. కేంద్రంలోని అధికారంతో కేసులను బూచీగా చూపి ఆ పనిచేయగల సామర్థ్యం బీజేపీ సొంతం. అందుకే ఇద్దరూ దీనిపైన ఒకే స్ట్రాటజీతో ఎత్తుగడలు వేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఒకసారి బీజేపీ రాష్ట్రాల్లో బలపడితే ఇక ప్రాంతీయ పార్టీలు కోలుకోవు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా చిన్నా భిన్నం కావడం ఖాయం. ఇప్పుడు బీజేపీ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. ఎన్నికల్లో దెబ్బతిన్న టీడీపీని నామరూపాలు లేకుండా చేసి ఏపీలో ప్రతిపక్ష హోదాకు ఎదగాలని బీజేపీ చూస్తోంది. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల నాటికి ఎదుర్కొని గద్దెనెక్కాలని స్కెచ్చులు గీస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి శత్రువైన బీజేపీని జగన్ అయినా, అటు చంద్రబాబు అయినా ఎదుర్కోవడం ఎలా అనే దానిపైనే సీరియస్ గా దృష్టిపెడుతున్నారట.. బీజేపీ బలపడితే టీడీపీకి - వైసీపీ కి కూడా నష్టమే. అందుకే బలపడనీయకుండా నేతలను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ నుంచి ఫిరాయింపులను పోత్సహించకపోవడం కూడా చంద్రబాబుకు శ్రీరామరక్ష అవుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు బలహీన బీజేపీలోకి పోకుండా బాబు కాపాడుకుంటున్నారు. ఉమ్మడి శత్రువైన బీజేపీని రాష్ట్రంలో ఎంటర్ కాకుండా చేయడంలో జగన్ తోడ్పాటు బాబుకు ఉందనడానికి ఈ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడమే కారణం అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ చర్య టీడీపీని బలంగా నిలబెడుతుంది. ఈ విషయంలో ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం ఏపీని బతికిస్తోంది. అదే సమయంలో దూసుకొస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేస్తోంది. జగనే టీడీపీ నేతలను లాగితే బీజేపీ మరింత లాగి టీడీపీని తుత్తు నియలు చేస్తుంది. టీడీపీ బలహీన పడితే జగన్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఆ ప్లేసులో బీజేపీ వస్తే జగన్ కు కూడా కష్టమే. అందుకే జగన్ తోడ్పాటు.. బాబు పట్టుదలతో టీడీపీ బతుకుతోంది. బీజేపీని వీరిద్దరూ ఈ రకంగా నిలువరిస్తున్నారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేసిన కేసీఆర్ కు ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం టీడీపీని రక్షిస్తూ జగన్ ఓ రకంగా తనను తాను బీజేపీ నుంచి రక్షించుకుంటున్నారు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించని వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏపీని జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి కాపాడుతుందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.