Begin typing your search above and press return to search.
జగన్ నో ఫికర్..చంద్రబాబు చకోర పక్షిలా
By: Tupaki Desk | 5 Feb 2018 7:31 AM GMT ఏపీ సీఎం చంద్రబాబు చకోర పక్షి వర్షపు చినుకు కోసం వేయికళ్లతో ఎదురుచూసినట్లు..రాష్ట్రంలో ఉన్ననియోజక వర్గాల్ని కేంద్రం ఎప్పుడు పెంచుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అందుకే కేంద్రంతో భేటీ అయినప్పుడల్లా నియోజకవర్గాల ప్రస్తావన తెస్తున్నారు. కానీ కేంద్రం రేపు మాపు అంటూనే కాలం వెళ్లదీస్తుంది. దీంతో ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే తమ భవిష్యత్తు ఏంటని తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. త్వరలో కేంద్రం నియోజకవర్గాలన్ని పెంచుతుందని - తద్వారా తమ పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే సీటు కన్ ఫాం అని ఆశ చూపారు. దీంతో వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యే పచ్చకండువా కప్పుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని చెప్పుకోవచ్చు.
దీనికి తోడు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా నియోజకవర్గాల్ని పెంచితే టీడీపీ కి లాభం చేకూరుతుందని ప్రచారం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపుల ఎమ్మెల్యేల సీట్లపై ఢొకా ఉండదని చెప్పుకొచ్చింది. అంతేకాదు చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి అభ్యర్ధుల కొరత ఎక్కువగా ఉందని అదే టీడీపీ కి ప్లస్ అవుతందంటూ పుంకాలుపుంకాలుగా కథనాల్ని వల్లివేసింది.
నాటి కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు రాజ్యాంగంలోని 175వ అధికరణ సూచించిన విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు - తెలంగాణాలో 153కు పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. ఆ సీట్లపెంపుపై చంద్రబాబు హస్తిన పర్యటనలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. 2019ఎన్నికల కోసమే టీడీపీ నియోజకవర్గాల పెంపుపై దృష్టిసారించిందని ...కాబట్టే కేంద్ర కమలం నేతలు కూడా తాత్సార్యం చేస్తున్నారనే గుసగులు వినిపిస్తున్నాయి.
ఇక వైసీపీ విషయాని కొస్తే టీడీపీ ఎత్తుల్ని చిత్తు చేసేలా పాదయాత్రలో ఉన్న జగన్ వ్యూహాలు రచయిస్తున్నాడు. నియోజవర్గాలు పెంచినా ఇబ్బందులు తలెత్తకుండా ఫిరాయింపు పాల్పడ్డ నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఆ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎటొచ్చి కేంద్రం నియోకవర్గాల్ని పెంచినా టీడీపీ తీవ్రం నష్టం కలుగుతుందే తప్పా వైసీపీకి కాదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది.