Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ: వార్ కంటిన్యూస్
By: Tupaki Desk | 1 Sep 2015 4:00 AM GMTఏపీ శాసనసభ సమావేశాలు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు జగన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. తమ సీఎం చంద్రబాబునాయుడు ఏపీని ఎలా అభివృద్ధి చేయాలా...నవ్యాంధ్రకు ఎలా నిధులు రాబట్టాలా అని ప్రతి రోజు హోం వర్క్ చేస్తుంటారని..అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి రోజు మనీ లాండరింగ్ కంపెనీలు..సూట్ కేసుల కంపెనీలు ఎలా పెట్టాలా అని హోం వర్క్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు. జగన్, ఆయన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విషయంలో బాగా ఆరితేరిపోయారని యనమల ఫైర్ అయ్యారు. అందుకే ప్రతి శుక్రవారం జగన్ జైలు దర్శనం చేసుకోవాల్సి వస్తోందని సెటైర్ వేశారు.
ఇందుకు జగన్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఓట్లకు కోట్ల మీద ఎక్కువగా హోం వర్క్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందుగా చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంపై మాట్లాడుతూ ఒక రాష్ర్ట ప్రభుత్వంపై మరో రాష్ర్ట ప్రభుత్వం నిఘాపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ధర్మం తనవైపు ఉందని..తాను ఎవ్వరికి భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను జీవింతో ఏ తప్పు చేయలేదని..తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకు తెలుసని... రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన ఘనత మీకే ఉందంటూ ప్రతిపక్షనేత జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేశారు.