Begin typing your search above and press return to search.
బాబు బాబే.. కేసీఆర్ కేసీఆరే
By: Tupaki Desk | 21 Oct 2015 7:31 AM GMTమనసును దోచుకోవటంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. విభజన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోలిక అనివార్యమైన నేపథ్యంలో ప్రతి అంశాన్ని ఒకరితో మరొకరిని పోలవటం సహజం. ఇలాంటి సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందులోని చేతికి ఎముక లేనట్లుగా వరాలు ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో బాబు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులిద్దరూ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని చేపడితే.. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ప్రసంగించిన ఇద్దరు ముఖ్యమంత్రుల విధానాల్ని చూస్తే.. కేసీఆర్ వరాల ముందు చంద్రబాబు చిన్నబోయారు. విధి నిర్వహణలోతమ ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేసే పోలీసులకు పెద్ద పీట వేస్తాననే మాటలకు తగ్గట్లే చేతల్లో కూడా పోలీసులపై వరాల వర్షం కురిపించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు ప్రోత్సహకాలు.. ప్రమోషన్లు ఇస్తామని ఊరించిన ఆయన.. అక్కడితో ఆపకుండా ఎస్ ఐ.. ఆ పై స్థాయి అధికారులకు వారు పని చేసే చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు.
కానిస్టేబుల్ నుంచి ఏఎస్ ఐ వరకూ.. పేదలకు తమ ప్రభుత్వం కట్టించి ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్లను.. ఎస్ ఐ ఆ పై స్థాయి అధికారులకు మున్సిపాలిటీల పరిధిలో ఇళ్లు కేటాయిస్తామంటూ తియ్యటి కబురు చెప్పారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 35 శాతం అలవెన్స్ ప్రకటించిన ఆయన.. పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్సును సైతం రూ.3500 నుంచి రూ.7వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక.. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలా వరాల మీద వరాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే.. చంద్రబాబు మాత్రం నాలుగు మాటలు చెప్పి.. పోలీస్ శాఖ సంక్షేమ నిధికి రూ.15కోట్లు నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమ నిధికి కోట్లు ఇచ్చే కన్నా.. ప్రతి పోలీసుకు ఎంతో కొంత ప్రోత్సాహాన్ని ప్రకటిస్తే బాగుండేది. అందుకేనేమో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన వరాల లిస్ట్ ను చూసి.. ఏపీ పోలీసులు తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. ప్రత్యేక దినోత్సవం రోజున పోలీసులకు చంద్రబాబు నీరసం వచ్చేలా చేశారని చెప్పొచ్చు. అందుకేనేమో.. ఏపీ ప్రాంతానికి చెందిన ఒక ఉన్నతాధికారి తాజా వరాల విషయం మీద స్పందిస్తూ.. చంద్రబాబు చంద్రబాబే.. కేసీఆర్ కేసీఆరే అంటూ మొత్తం విషయాన్ని ఒక్క మాటలో తేల్చేశారు.