Begin typing your search above and press return to search.

ప‌రిటాల వారి పెళ్లి వేడుక‌లో ఇద్ద‌రు చంద్రుళ్లు

By:  Tupaki Desk   |   1 Oct 2017 9:42 AM GMT
ప‌రిటాల వారి పెళ్లి వేడుక‌లో ఇద్ద‌రు చంద్రుళ్లు
X
ఏపీ మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ పెళ్లి వేడుక ఈ రోజు అనంత‌పురం జిల్లా వెంక‌టాపురంలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఎత్తున జ‌రుగుతున్న ఈ పెళ్లికి ఏపీ.. తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు - చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) తో స‌హా ప‌లువురు మంత్రులు.. నేత‌లు.. సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

వివాహానికి హాజ‌రైన అతిధుల‌ను మంత్రి సునీత స్వ‌యంగా స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పెళ్లి వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ.. చేతులు ఊపుతూ క‌నిపించారు. బాబును చూసేందుకు వేడుక‌కు హాజ‌రైన వారు అతృత ప్ర‌ద‌ర్శించారు. చంద్ర‌బాబు వియ్యంకుడు.. ఎమ్మెల్యే.. ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి బాల‌కృష్ణ కుటుంబంతో స‌హా పెళ్లికి హాజ‌ర‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వేదిక మీద‌కు వ‌చ్చే స‌మ‌యానికి పెళ్లి వేడుక‌కు వ‌చ్చిన వారిలో ప్ర‌త్యేక ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. నూత‌న వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ కేసీఆర్ కాళ్ల‌కు మ‌న‌స్కారం చేశారు.

ఇక పెళ్లి వేడుక‌లో మంచు ల‌క్ష్మి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు. ఆమె క‌నిపించిన వెంట‌నే.. ఆమెతో సెల్ఫీ దిగేందుకు పెద్ద ఎత్తున ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. సీనియ‌ర్ న‌టులు మోహ‌న్ బాబు.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.. తార‌క‌ర‌త్న‌.. క‌మేడియ‌న్ వేణుమాధ‌వ్ తో స‌హా మ‌హిళా ఛైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.