Begin typing your search above and press return to search.
‘తమిళ’ఉదంతం ఏ చంద్రుడికి స్ఫూర్తినిస్తుందో
By: Tupaki Desk | 26 July 2015 5:15 AM GMTఅధికార పక్షానికి.. విపక్షానికి మధ్య వాదులాట నిత్యం ఉండేదే. ఏడాదికి నాలుగైదు సార్లు ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారపక్షం దూకుడుగా వెళ్లటం.. దానికి కళ్లాలు వేస్తూ.. తనకు అనుకూలంగా మార్చుకునేలా విపక్షాలు ప్రయత్నించటం లాంటివి మామూలే.
ఈ క్రమంలో విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం మామూలే. కాస్త హుషారు ఎక్కువ ఉన్న విపక్ష నేత గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలటం.. గవర్నర్ ప్రసంగ ప్రతుల్ని ముక్కలుగా చించేసి గాల్లో ఎగరేయటం లాంటివి చూస్తున్నదే. ఇలాంటి చర్యలే తమిళనాడులో చోటు చేసుకున్నాయి. అధికార అన్నా డీఎంకే వైఖరిని నిలదీస్తూ.. డీఎంకేకు చెందిన ఆరుగుతు ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు ఈ సందర్భంగా గవర్నర్ పై దాడి చేశారన్న ఆరోపణలపై వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
సభ నుంచి సస్పెన్షన్ ఏ రెండు రోజులకో.. వారం రోజులకో.. లేదంటే సదరు సెషన్ వరకో కాకుండా.. ఏకంగా ఏడాది వరకు సస్పెండ్ చేసేశారు. వామ్మో అన్న మాట నోటి నుంచి వచ్చే లోపు.. శిక్షల లిస్ట్ ఇంకా ఉందంటూ.. వరుస పెట్టి మరీ చెప్పుకొచ్చారు. దీని ప్రకారం.. సదరు ఎమ్మెల్యేలకు కేటాయించిన అధికారిక నివాసానికి తాళం వేయటంతోపాటు.. వారికిచ్చే జీతం.. డీఏ.. టెలిఫోన్ అలవెన్సులు ఇలా చెప్పుకుంటూ అధికారికంగా అందే ఏ సదుపాయాన్ని లేకుండా చేశారు.
దీంతో షాక్ తిన్న వారు ఇప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది. మరి.. దీనిపై కోర్టు ఏ విదంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. విభజన నేపథ్యం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వ్యక్తిగత స్థాయిల్లోకి మారటం.. అధికార.. విపక్షాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న నేపథ్యం లో.. తమిళనాడు తరహాలో చర్యల కొరడాను ఏ చంద్రుడు బయటకు తీస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మాట వినని వారిని.. పరిస్థితి తమ కంట్రోల్ లో ఉంచుకునేందుకు తమిళనాడు తరహాలో చర్యలు ఉంటే.. అధికారపక్షం తిరుగు లేనిదిగా.. విపక్షం బిక్కచచ్చిపోవటం ఖాయం. అలాంటిదే జరిగితే ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.