Begin typing your search above and press return to search.
పాపం గవర్నర్ చాలా ఫీలయ్యారు
By: Tupaki Desk | 15 Aug 2015 3:40 PM GMTస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమం వార్తల్లో నిలిచింది. తెలుగు రాష్ర్టాల ప్రథమ పౌరుడు అయిన గవర్నర్ గౌరవార్థం ఇచ్చిన విందుకు ఆ రాష్ర్టాల ముఖ్యులిద్దరూ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. గవర్నర్ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఇద్దరూ హాజరుకాలేదు.
ఈ విషయం చర్చనీయాంశం అవడం గమనించిన గవర్నర్...ఇద్దరు సీఎంలు ఎట్ హోం కార్యక్రమానికి రాకపోవడానికి ఎలాంటి ప్రత్యేక కారణాలు అన్వేషించవద్దని కోరారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు తాను ఆమోదయోగ్యమైన గవర్నర్ నేనని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న చివరిరోజు వరకు ఆమోదయోగ్యంగానే ఉంటానని వ్యాఖ్యానించారు. తాను ఆశావాదినని... పరిస్థితులన్నీ కాలానుగుణంగా చక్కబడతాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలను గవర్నర్ నరసింహన్ పేరుపేరునా పలకరించి, ఉత్సాహం ప్రదర్శించారు.