Begin typing your search above and press return to search.
చంద్రులకు సన్ స్ట్రోక్
By: Tupaki Desk | 28 Oct 2018 1:13 PM GMTతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు - నారా చంద్రబాబు నాయుడులకు చిక్కుల మీద చిక్కుల వస్తున్నాయి. ఇబ్బందుల మీద ఇబ్బందుల వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు - ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కష్టాల కడగండ్లు వెంటాడుతున్నాయి. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం ఒకే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏమిటనుకుంటున్నారా.... ఏం లేదు. సన్ స్ట్రోక్. అదేనండీ....ఇద్దరు ముఖ్యమంత్రులను వెంటాడుతున్నది కుమారుల నుంచి ఇబ్బందులే. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు - ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ పార్టీల అధ్యక్షుల కుమారుల నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ కుమారుల మీద ఉన్న ప్రేమానురాగాలతో ఇద్దరికి అర్హత ఉన్నా...లేకున్నా రెండు ప్రభుత్వాలలోనూ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ కూడా ఐటీ శాఖ మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల పుత్రోత్సాహం కారణంగా వారిద్దరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి టిక్కట్లు దొరకని వారు - టిక్కట్లు లభించినా మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యలు - ఆయన చేస్తున్న ప్రసంగాల ద్వారా అభ్యర్ధులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. సిట్టింగుల్లో చాలా మందికి టిక్కట్లు రాకుండా తన మనుషులకే టిక్కెట్లు ఇప్పించుకోవాలని మంత్రి కెటీఆర్ భావించారు. అయితే ఆయన వాదనను కాదని ముఖ్యమంత్రి సిట్టింగులకు ప్రాధాన్యత ఇవ్వడంతో కెటీఆర్ అన్యమనస్కంగానే ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో దాదాపు 30 మంది పట్ల తారక రామారావు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పైగా వీరిని ప్రకటించే ముందు తనకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదనే కినుక మీద కూడా ఉన్నారంటున్నారు. దీంతో ఈ తలనొప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు కె.చంద్రశేఖర రావును వేధిస్తోందంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ తీరుతో అటు ప్రభుత్వంలోను - ఇటు పార్టీలోనూ కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోందంటున్నారు. నారా లోకేష్ చేస్తున్న ప్రకటనలు - ఆయన చేస్తున్న ట్విట్లతో పార్టీకి లాభం కంటే తీవ్ర నష్టమే కలుగుతోందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తర్వాత లోకేష్ చేసిన ప్రకటనలపై తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు - కార్యకర్త నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందంటున్నారు. ఇంతకు ముందు కూడా మంత్రిగా లోకేష్ చేసిన పలు వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయంటున్నారు. తెలంగాణలోను - ఆంధ్రప్రదేశ్ లోను ఇద్దరు ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులకు సన్ స్ట్రోక్ మాత్రం తీవ్రంగానే ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకు తమ కుమారుల నుంచి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.