Begin typing your search above and press return to search.
చంద్రుళ్ల మాటల్లో ఆ వేడి ఏమైంది?
By: Tupaki Desk | 29 Jan 2016 11:30 AM GMTఆ ఇద్దరు ఒకప్పటి సహచరులు... తరువాత బద్ధ విరోధులు... మళ్లీ ఇప్పుడు మిత్రులు.. రెండు తెలుగు రాష్ట్రాలకు సారథులు. ఇద్దరూ ఒకే రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.. మాటల తూటాలు సంధించుకున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వేదికగా చంద్రబాబు - కేసీఆర్ లు చేసిన ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కానీ, అందులో మునుపటి వేడి లేదు.. ఉన్నదంతా రాజకీయ అవసరమే.
టీడీపీ - టీఆరెస్ పార్టీల అధినేతల తనయుల పోరుతో పోటాపోటీగా మారిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం, ఇప్పుడు పెద్ద తలకాయల(చంద్రబాబు - కేసీఆర్) రాకతో వేడెక్కింది. యువరక్తం ప్రవహించే కేటీఆర్-లోకేష్ మాటల తూటాల కొనసాగుతున్న నేపథ్యంలో, వారి తండ్రులు ఇద్దరూ తెరమీదకు రావడంతో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ చాలా నెలల తర్వాత మీడియా ముందుకొచ్చి, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను వస్తే ట్రాఫిక్ జాం అవుతున్నందున ప్రచారానికి వెళ్లలేదని, తన గైర్హాజరుకు కారణం చెప్పారు.
విలేకరుల సమావేశంలో చాలా సేపు సమాధానాలు ఇచ్చిన కేసీఆర్, చాలా హుందాగా మాట్లాడారు. ఎప్పుడూ ప్రత్యర్ధులపై ఒంటికా లితో లేచే ఆయన, నేడు చాలా ప్రశాంతంగా, నవ్వుతూ కనిపించారు. 'అసలు చంద్రబాబుకు హైదరాబాద్ లో ఏం పని? ఇక్కడ ఆయనది వృధా ప్రయాస. గ్రేటర్ ఎన్నికల ఫలితం ఎప్పుడో తేలిపోయింది. ఆయనకు అక్కడ ఊడ్చుకోడానికి 13 జిల్లాలున్నాయి. అక్కడ దృష్టి పెట్టడానికే సమయం ఉండదు. ఇక హైదరాబాద్ కు వచ్చి ఏం చేస్తారు. కాల్ మనీ పెట్టుబడుదారులంతా హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. బాబుపై కేసు గ్రేటర్ ఎన్నికల తర్వాత చూద్దాం. చంద్రబాబుతో రాజ్యాం గపరమైన ఫ్రెండ్ షిప్ కొనసాగుతుంది. నిజానికి నేను అమరావతికి వెళ్లి ఏపికి సాయం ప్రకటిద్దామనుకున్నా. కానీ అక్కడికొచ్చిన మోదీ నీళ్లు - మట్టి ఇచ్చార''ని వ్యాఖ్యానించారు. అయితే గతంలో మాదిరిగా కేసీఆర్ ఈసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడకపోవడం గమనార్హం.
మరోవైపు ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబునాయుడు కూడా తొలిరోజు ప్రచారంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'చంద్రబాబునాయుడుకు హైదరాబాద్ లో ఏం పని అని కొందరంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలోనే. నా రాజకీయం జీవితం ఇక్కడ నుంచే మొదలయింది. నన్ను అన్ని ప్రాంతాల వారు అభిమానిస్తున్నారు. కొంతమంది నేను ఎక్కడికో వెళ్లిపోయానంటున్నారు. ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంటా. మీకు అండగా నిలుస్తా.అర్ధరాత్రి కష్టం వస్తే మీ ముందుంటా. బాబ్లీ ప్రాజెక్టు ఆపాలని పోరాడి అరెస్టయ్యా. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నా'' అన్నారు. ' తెలంగాణ గురించి మాట్లాడేందుకు నేనెవరికీ భయపడను. నేను ఇందిర - రాజీవ్ - సోనియాలకే భయపడలేదు. మనది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. ధైర్యానికి మారుపేరు టిడిపి. భయపడే సమస్యే లేదు. అమరావతి శంకుస్థాపనకు నేనే స్వయంగా వచ్చి కేసీఆర్ ను పిలిచా. ఆయన వచ్చి నన్ను పిలిస్తే చండీయాగంలో భాగస్వామినయ్యా. రాజకీయం వేరు. ప్రభుత్వాలు వేరు. రాజకీయంగా మా పార్టీ పోరాటం కొనసాగుతుంది'' అని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతోందో టీఆర్ ఎస్ ప్రభుత్వమే చెప్పాలి' అని బాబు విమర్శించారు. మొత్తానికి ఇద్దరు చంద్రుల ప్రచారంతో, రాజధాని నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు ప్రచారం నేటితో ముగుస్తుండగా, కేసీఆర్ 30న జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అయితే.... ఎంత చేసినా ఇద్దరు చంద్రుళ్ల మాటల్లోనూ మునుపటి వాడి లేదన్నది ప్రజలకు అర్థమైంది.