Begin typing your search above and press return to search.
గవర్నరు ఇఫ్తార్ విందుకు వారొస్తారా రారా?
By: Tupaki Desk | 23 Jun 2016 10:51 AM GMTరాష్ర్ట విభజనతో రగిలిన వివాదాలు కాస్త చల్లారి మధ్యలో కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడినా మళ్లీ కొన్నాళ్లుగా మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎడమొహం పెడమొహం పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా జల వివాదాలతో ఏపీ - తెలంగాణలు ఉప్పూ-నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి తరునంలో రెండు రాష్ట్రాల సీఎంలు మళ్లీ కలుసుకునే అవకాశం వచ్చింది. శుక్రవారం రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడంతో మళ్లీ సీఎంలిద్దరూ కలుస్తారా అన్న చర్చ మొదలైంది.
అయితే.. కృష్ణా నీటి వివాదం - ప్రాజెక్ట్ ల నిర్మాణంపై కేంద్రానికి ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు చేసుకుంటున్న ఇద్దరు సీఎంలు… ఇఫ్తార్ విందుకు వస్తారా..? అన్నదానిపై అనుమానాలున్నాయి.
కలిస్తే ఏంటీ…? కలవకపోతే ఏంటీ అనే లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు- కేసీఆర్ ల కలయికపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ముఖ్యమంత్రులకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. విందుకు ఇద్దరు సీఎం వస్తారా…? రారా..? అన్నది చర్చనీయాంశమవుతోంది.
గతంలోనూ ఒకట్రెండు సందర్భాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే పరిస్థితులు ఏర్పడినా ఇద్దరూ తెలివిగా తప్పించకున్నారు. ఒకరు వస్తే ఇంకొకరు రాకపోవడం.. లేదంటే ఇద్దరూ వేర్వేరు సమయాల్లో రావడం వంటి ఎత్తుగడలతో చిక్కడు దొరకడులా తప్పించుకున్నారు. రెండు రాష్ర్టాల మధ్య పరిస్థితులును చక్కదిద్దడానికి గవర్నరు కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆయనే ఇఫ్థార్ విందుకు పిలవడంతో ఈసారైనా ఇద్దరు కలుస్తారా లేదంటే మళ్లీ చిక్కడు దొరకడు ఎపిసోడ్ రిపీట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతోందో తేలాలంటే శుక్రవారం వరకు వెయిటింగు తప్పదు.