Begin typing your search above and press return to search.
ఇద్దరు చంద్రులు డిసైడయిపోయారట
By: Tupaki Desk | 24 Nov 2016 3:56 AM GMTకేంద్ర ప్రభుత్వంతో ఆత్మీయ సంబంధాలు నెరపడంలో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు - కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో విషయంలోనూ ఇదే రీతిని కనబర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీఎస్‌టీ బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తే ఆ వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయ. ఒకవేళ పార్లమెంటులో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందకపోతే - అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏకీకృత పన్ను విధానానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కోసం రెండు నెలల క్రితం పార్లమెంటు ఉభయ సభలూ ఆమోద ముద్ర వేసి అన్ని రాష్ట్రాల ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీని సమావేశపరిచి దానికి ఆమోదం తెలిపింది. ఏపీ కూడా వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా అంటే 16 రాష్ట్రాలకు మించి ఆమోదం తెలపాల్సిన ప్రక్రియ పూర్తయింది. కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జీఎస్ టీ బిల్లును ఆమోదించి అన్ని రాష్ట్రాలకు పంపిస్తుంది. అన్ని రాష్ట్రాలూ ఆ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.... పార్లమెంటులో ఆమోదం కోసం జీఎస్ టీ బిల్లు రాకపోతే ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా భావిస్తోంది. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సమావేశాలను ఆరు నెలల వ్యవధికి మించి నిర్వహించకపోతే ఆ అసెంబ్లీ ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. కాబట్టి ఏపి ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు.
మరోవైపు అదే రీతిలో కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుండటం గమనార్హం. జీఎస్ టీ రాజ్యాంగ సవరణ కోసం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించినందున నేరుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవచ్చని కేసీఆర్ సర్కారు ఆలోచన చేస్తున్నది. జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం వస్తే మాత్రం శీతాకాల సమావేశాలు నిర్వహించవచ్చని భావిస్తుంది. మొత్తంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని ఘట్టిగా సమర్థించేందుకు ఆసక్తితో ఉన్నారు. అయితే పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దుపై ప్రతిరోజూ గొడవ జరుగుతున్నందున, జీఎస్ టీ బిల్లును ప్రతిపాదించి ఆమోదించే సూచనలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/