Begin typing your search above and press return to search.
మే23 తర్వాత కేసీఆర్ - బాబుల పరిస్థితిదీ..
By: Tupaki Desk | 6 May 2019 9:34 AM GMTకేసీఆర్ ఆల్ రెడీ గెలిచే ఉన్నాడు.. ఇప్పుడు మే 23న వచ్చే ఫలితంతో గులాబీ దళపతికి పోయేది ఏమీ లేదు.. అందుకే ధీమాగా.. జాతీయ పాలిటిక్స్ పై తన కన్నేశారు. వెంట్రుకతో జాతీయ రాజకీయాలను లాగడానికి ప్రయత్నిస్తున్నారు.. వస్తే కొండ.. లేదంటే వెంట్రుక కేసీఆర్ కు వచ్చిన నష్టమేమీ లేదు..
కానీ పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలా కాదు.. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోతే జీరోనే.. జాతీయ స్థాయిలోనూ.. రాష్ట్ర స్థాయిలో పడిపోతారు.. ప్రాధాన్యత కోల్పోతారు. పదవులు లేని రాజకీయ నేతలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోరు.. వచ్చే ఐదేళ్లకు అంటే 2024 వరకు వయోభారంతో బాబు రాజకీయాలను ఏలుతారో లేదో చెప్పడం కష్టమే.. ఇప్పుడు ఏపీ సీఎంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బాబు.. ఓడిపోతే మాత్రం చక్రం కాదు కదా..బొంగరం కూడా తిప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇలా ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల పరిస్థితి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలకు వెళ్లి ముందే సర్దుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఫుల్ కాన్ఫిడెన్స్ తో కేసీఆర్ చెలరేగిపోతున్నారు. మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ బాట పట్టారు. దేశంలో మోడీ వేవ్ తగ్గడం.. నాలుగు విడతల్లో కలిపి బీజేపీ 140 సీట్లు రావని తేల్చుకోవడంతో కేసీఆర్ మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వెళుతూ తన ఫెడరల్ ఫ్రంట్ ఆశలను బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..
అయితే చంద్రబాబుది భిన్నమైన పరిస్థితి.. ఆయన మరోసారి ఏపీకి సీఎంగా అవుతానే మనుగడ.. లేదంటే కనుమరుగు కావాల్సిందే. కేంద్రంలో ప్రాధాన్యత ఉండదు.. చేతిలో ఎంపీ సీట్లు ఉండవు.. సో బాబును పట్టించుకునే నాథుడే ఉండరు. అందుకే బాబు ఇప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ ను ఎవరూ నమ్మరంటూ పార్టీ నేతలతో చెబుతున్నారు..
చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ కు సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో లాభమేమీ లేదు. హంగ్ వస్తే కేసీఆర్ కింగ్ మేకర్ అవుతాడు.. రాకపోయినా తెలంగాణ సీఎంగా దేశంలో కింగ్ లానే ఉంటాడు. కానీ ఏపీలో మరోసారి అధికారంలోకి రాకపోతే బాబు డమ్మీ అయిపోతడు.. ఏపీ పీఠం దక్కదు.. జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యమూ ఉండని పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో కాదు.. కనీసం రాష్ట్రస్తాయిలోనూ టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయే చాన్స్ ఉందంటున్నారు.