Begin typing your search above and press return to search.
కొత్త సీఎస్ కోసం చంద్రబాబు వర్సెస్ లోకేష్
By: Tupaki Desk | 27 Nov 2015 3:41 PM GMTఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనే విషయంలో పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవీఆర్.కృష్ణారావు పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆయన రిటైరయ్యాక అత్యంత కీలకమైన ఈ పోస్టుకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ మదిలో వేర్వేరు వ్యక్తులు ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న ఇన్నర్ టాక్. దీంతో ఫైనల్ గా ఎవరు ఏపీ కొత్త సీఎస్ అవుతారన్నదానిపై పెద్ద సస్పెన్సే నడుస్తోంది.
చంద్రబాబు అనుభవానికి పెద్దపీట వేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉండగా...లోకేష్ కు మరో వ్యక్తికి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త సీఎస్ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితా పరిశీలిస్తే ఇద్దరు ఐఏఎస్ లు ఈ పోస్టుకు పోటీపడుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి టక్కర్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు కావడంతో టక్కర్ కు సీఎస్ పోస్టు కోసం ఫస్ట్ ప్లేసులో ఉన్నారు.
ఇక మరో సీనియర్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కూడా సీఎస్ పోస్ట్ ఆశిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జాగర్లమూడి పద్మావతికి స్వయంగా అల్లుడైన నిమ్మగడ్డ రమేష్ కు టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబుతో మంచి పరిచయాలు ఉన్నాయి. టీడీపీలోనే కొందరు సీనియర్ నాయకులు ఈయనకు మద్దతు ఇస్తున్నారు. అలాగే యువనేత లోకేష్ కూడా రమేష్ కు సామాజిక కోణంలో మద్దతు ఇస్తున్నట్టు ఏపీ పొలిటికల్ కారిడాల్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఫైనల్ గా చంద్రబాబు కోర్టులో డెసిసన్ ఉన్నందున ఆయన టక్కర్ వైపే మొగ్గు చూపుతున్నందున ... ఏపీ కొత్త సీఎస్ పోస్టు టక్కర్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.