Begin typing your search above and press return to search.
అబ్బాయ్ వారానికో రోజు..నాన్న నెలకు ఒకసారి
By: Tupaki Desk | 19 July 2016 4:47 AM GMTతెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కనుచూపు మేర కనిపించని పరిస్థితి. అయినప్పటికీ.. ఆశ తగ్గని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ ఇద్దరూ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా రకరకాల ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇందుకోసం ఈ మధ్యనే చినబాబు లోకేశ్.. వారానికి ఒక రోజు తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో భేటీ కావాలని నిర్ణయించుకోవటం తెలిసిందే.
చెప్పిన మాటకు తగ్గట్లే వారాంతంలో తెలంగాణ టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ అవుతున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్ని పరిశీలించటం.. పరిణామాలను తెలుసుకోవటంతో పాటు.. జిల్లాల వారీగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా పావులు కదుపుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై తాను ప్రతి నెలలో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. పార్టీ గతంలోనూ ఎన్నో సంక్షోభాలను చూసిందని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉందన్న ఆయన.. నెలకోమారు తెలంగాణ పార్టీ వ్యవహారాల్ని తాను సమీక్షిస్తానని చెప్పుకొచ్చారు. తండ్రి నెలకోసారి.. కొడుకు వారానికి ఒకసారి ప్రత్యేకంగా దృష్టి సారించటంతో ఏదైనా మార్పు వస్తుందో చూడాలి.