Begin typing your search above and press return to search.
లోకేష్, బాబు కలిసి కన్ఫర్మ్ చేశారు
By: Tupaki Desk | 16 Feb 2016 4:39 PM GMTతెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిసారించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం అనే లక్ష్యాలను ఆధారం చేసుకొని పార్టీని క్రియాశీలం చేయాలని బాబు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీ వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం, అందులో పార్టీశ్రేణులను భాగస్వామ్యం చేయలేదనే ఫీడ్‌బ్యాక్ ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. గతంలో విజయవాడలో రెండుసార్లు పార్టీ అధ్యక్షుడి హోదాలో సమావేశం నిర్వహించినప్పటికీ కార్యక్రమాల్లో మార్పులు రాకపోవడంతో చంద్రబాబు ఈ కొత్త వ్యూహరచన చేశారు. క్యాడర్‌ను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు రూపొందించేందుకు జిల్లాల వారీగా చంద్రబాబు, లోకేష్ సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా పార్టీ కోసం పూర్తిస్థాయిలో దృష్టి సారించని నాయకత్వాన్ని మార్చాలని కూడా బాబు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఇలా పార్టీ బలోపేతంతో పాటు సంక్షేమ కార్యక్రమాల చేరువ గురించి సైతం చంద్రబాబు నజర్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో సంక్రాంతి కానుకపై ప్రజల్లో అంత సంతృప్తి లేదని, విమర్శలూ వచ్చాయని అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా వారికి చేరటంలేదనే విమర్శలు వస్తున్నాయని, వీటిపైనా దృష్టి సారించాలని చంద్రబాబు డిసైడయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల సమావేశం అనంతరం క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ప్రచారం చేసే బాధ్యతను పార్టీ ద్వారా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. అందుకు జిల్లాల్లోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ నివేదికలు పంపాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఆదేశించారు. జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా నివేదికలివ్వాలని కోరారు. వీటి ఆధారంగా ఏ విధమైన కార్యక్రమాలను రూపొందించాలనే విషయంపై ఒకటీ రెండు రోజుల్లో కార్యక్రమాలు రూపొందించనున్నారు. మొత్తంగా పరిపాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని దూకుడుగా ముందుకు నడిపించేందుకు చంద్రబాబు, లోకేష్ వేస్తున్న ప్రణాళికల గురించి తెలుగుదేశం శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.