Begin typing your search above and press return to search.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో టీడీపీ నేతల తిండి బిల్లులు పెండింగ్ లోనే..
By: Tupaki Desk | 14 Oct 2019 1:08 PM GMTఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలని ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళేందుకు ఈ నెల 11వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ నేతలు చేసిన బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. సాధారణంగా ఎయిర్ పోర్టు నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్షనేత లేదా స్టేట్ - సెంట్రల్ క్యాబినెట్ హోదా కలిగిన నేతలు వచ్చినప్పుడు కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ సందర్భంలో టీ - స్నాక్స్ కు మాత్రమే అనుమతిస్తారు.
ఒకవేళ ఆ వీఐపీ.. భోజనం - అల్పాహారం తీసుకోవాలనుకుంటే ప్రొటోకాల్ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. మిగిలిన వాళ్లు - వీఐపీ సహాయకులు సైతం పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్లాల్సిందే. కానీ చంద్రబాబుతో పాటు వచ్చిన టీడీపీ నేతలు మాత్రం అలా చేయలేదు. చంద్రబాబు అల్పాహారం మాత్రమే తీసుకున్నప్పటికీ ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన టీడీపీ నాయకులు - కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
అసలు నిబంధనల మేరకు చంద్రబాబు ఒక్కరే వీఐపీ లాంజ్ లో అల్పాహారం తీసుకోవాలి. కానీ ఆ రోజు దాదాపు 30 మంది వరకు టీడీపీ నేతలు - కార్యకర్తలు పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నుంచి బిర్యానీలు తెచ్చుకుని విఐపి లాంజ్ లోనే తినేశారు. ప్రోటోకాల్ అధికారులు చెప్పిన వారు వినకుండా అక్కడే బిర్యానీలు లాగించేశారు. పైగా వీళ్ళు వెళ్లిపోయాక రెస్టారెంట్ ఓనర్ వచ్చి బిల్లు..అధికారులని అడిగారు. అధికారులు మాత్రం ఆ బిల్లు తాము ఇవ్వలేమని చెబుతున్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు - లోకేష్ బాబులు ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు ఖర్చు చేసిన బిల్లులే ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ వివాదం బయటకు రావడంతో గతంలో లోకేష్ చేసిన ఘనకార్యాలు కూడా బయటపడ్డాయి. లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రతిసారి ఇలాగే జరిగిందని తెలుస్తోంది. పైగా చిన్న తిను బండరాలకు కూడా లక్షల్లో బిల్లులు వేశారని తెలుస్తోంది. 2017 నుంచి 2019 మార్చి వరకు చంద్రబాబు - లోకేష్ బాబుల విశాఖ ఎయిర్ పోర్ట్ లో తినుబండారాల ఖర్చు సుమారు రూ.14లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.