Begin typing your search above and press return to search.
వాయిదా పడింది సరే - మళ్లీ అయిన కేబినెట్ భేటీ జరుగుతుందా?
By: Tupaki Desk | 8 May 2019 6:34 AM GMTపదో తేదీన అంటూ ముందుగా కేబినెట్ భేటీకి ముహూర్తాన్ని చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించుకున్నారు. అంతేగాక ఆ రోజు అధికారులు రాకపోతే ఎంత అని - ఎవరు రారో తనే చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హడావుడిచేశారు. చివరికి ఏమో కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు కాబట్టి.. అంటూ పాత రీజన్ తోనే కేబినెట్ భేటీ రద్దు అయినట్టుగా ప్రకటించుకున్నారు అధికారులు.
ఇక చంద్రబాబు కూడా చేసేది ఏమీ లేకుండా పోయింది. ముందుగా హడావుడి చేసి ఆ తర్వాత వెనక్కు తగ్గారు చంద్రబాబు. పూర్తిగా వెనక్కు తగ్గినట్టుగా అనిపించుకోకుండా..ఈ నెల పద్నాలుగున కేబినెట్ భేటీ జరుగుతుందని కొత్త మాట అల్లారు!
ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను అనుమతి కోరనున్నారట. అయితే ఈసీ ఆ విషయంలో అనుమతిని ఇస్తుందా? అనేది డౌటు! పేరుకు ఏమో కరువు - తుఫానుల అంశం గురించి చర్చించడానికి కేబినెట్ భేటీ అని చెబుతున్నారు.అయితే అంతకు మించిన లోతైన అంశాలు కొన్ని ఉన్నాయనే టాక్ వినిపిస్తూ ఉంది. తన అస్మదీయులకు సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్ వ్యవహారాలను - పాత బిల్లులను పూర్తిగా క్లియర్ చేయడానికే చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ విషయంలో ఇంతగా పట్టు పడుతూ ఉన్నారనేది ఒక ప్రచారం. ఆ సమావేశంలో ఏయే అంశాల గురించి చర్చించాలని అనుకుంటున్నారనే అంశం గురించి వీరు పూర్తిగా ఈసీకి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆ వివరణకు ఈసీ సంతృప్తి చెందితే కేబినెట్ భేటీకి అనుమతి దక్కవచ్చు! లేదంటే భేటీ లేనట్టే!
ఎలాగూ ఎన్నికల ఫలితాల వెల్లడికి మరెంతో సమయం లేదు. పద్నాలుగో తేదీన కేబినెట్ భేటీకి బాబు ప్రభుత్వం అనుమతిని అడుగుతోంది. ఆ తర్వాత ఎలాగూ తొమ్మిది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానే వస్తాయి. కాబట్టి.. ఆ మాత్రం దానికి ఇప్పుడు మీటింగ్ ఎందుకు అని ఈసీ అనుకున్నా - కేబినెట్ భేటీకి వీరు చెబుతున్న రీజన్లు అంత గట్టిగా లేవని అనుకున్నా.. కేబినెట్ భేటీకి అనుమతి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.