Begin typing your search above and press return to search.
చంద్రబాబు.. మోడీని బాగానే అన్నారు.. కానీ!
By: Tupaki Desk | 6 May 2019 1:30 AM GMTఏ విషయంలో అయినా ప్రధానమంత్రి నరేంద్రమోడీని గట్టిగానే విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ పనిలో భాగంగా మళ్లీ మరోసారి మోడీ మీద విరుచుకుపడ్డారు. ఈ సారి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే.. 'ఏపీ - తెలంగాణ ల మధ్యన గొడవలకు కారణం మోడీనే..' అని బాబు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించారు.
'ఐదేళ్లలో..' అంటూ చంద్రబాబు నాయుడు మోడీని కడిగేశారు. మోడీ వ్యవహరించిన తీరు గురించి ప్రశ్నించారు. అమరావతి శంకు స్థాపనకు మోడీని ఆహ్వానిస్తే ఆయన మట్టి, నీళ్లు ఇచ్చారంటూ బాబు విరుచుకుపడ్డారు. ఏపీ - తెలంగాణల మధ్యన విభజన సమస్యల గురించి ఏ రోజు పిలిచి మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇంకా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ మోడీ తీరును చంద్రబాబు నాయుడు ఏకేశారు. మోడీ మీద అసలే పీకల్దాకా కోపం మీదున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ఇలా విరుచుకపడ్డారు.
బాబు మాటలు బాగానే ఉన్నాయి కానీ.. ఈయన మాటలు వింటే ప్రజలకూ కొన్ని సందేహాలు రానే వస్తాయి. నిజమే మోడీ తీరు బాగా లేదు. అమరావతికి మట్టి - నీళ్లు తెచ్చివ్వడం - ఏపీ-తెలంగాణ ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మోడీ చొరవ చూపకపోవడం ఇవన్నీ మోడీ తప్పిదాలే అనుకుందాం. అయితే చంద్రబాబు నాయుడు అప్పుడే ఈ అంశాల గురించి మాట్లాడాల్సింది!
అమరావతికి మోడీ ఢిల్లీ నుంచి నీళ్లు - మట్టి తెప్పించినప్పుడు అనేక మంది విమర్శలు చేశారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అనేక మంది విరుచుకుపడ్డారా. ఇలా మట్టి - నీళ్లు తెచ్చివ్వడానికా అంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అనేక మంది అప్పుడు నిప్పులు చెరిగారు!
అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు! మట్టి - నీళ్లను మాత్రమే మోడీ తెచ్చారేంటి అని అంతా అనుకుంటున్నా బాబు మాత్రం మారు మాట్లాడలేదు. అదో సెంటిమెంట్ అన్నట్టుగా బాబు కవరింగ్ చేశారు. మోడీ చేసింది అంతా మంచిదే అని బాబుకు అప్పుడు అనిపించింది.
ఇక రెండు రాష్ట్రాల మధ్యన సమస్యలు ఉన్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు మాట్లాడలేదు! అప్పుడు కేసీఆర్ తో బాబు చట్టాపట్టాలేసుకుని తిరిగారు. అమరావతికి పిలిపించుకున్నారు. సత్కారాలు చేశారు. తెలుగుదేశం వాళ్ల ఇళ్లలో పెళ్లికి కూడా కేసీఆర్ ను పిలిపించుకున్నారు. అప్పుడు అంతా బాగానే అనిపించింది. ఇప్పుడే.. బాబుకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. వాటి విషయంలో మోడీని నిందిస్తూ ఉన్నారు! అందరూ మాట్లాడిన టైమ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. ఇప్పుడేమో ఈయన అస్సలు ఆపడం లేదు! దీని వల్ల ప్రయోజనం ఏమిటో బాబుకే తెలియాలి. ఇదంతా రాజకీయం కాదా?