Begin typing your search above and press return to search.
టీజీ పొత్తు మాటలు - టీడీపీకి సిగ్గులేదన్న పవన్
By: Tupaki Desk | 23 Jan 2019 1:14 PM GMTఏపీలో చంద్రబాబు పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. బాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అందరూ దాదాపు ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. అందుకే బాబుతో పాటు వారూ పొత్తుకు వెంపర్లాట మొదలుపెట్టారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన టీజీ వెంకటేష్ ఈరోజు మధ్యాహ్నం జనసేనతో పొత్తు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినపుడు ఏపీలో జనసేన-టీడీపీ కలిస్తే ఏంటి తప్పు అని ఒక లాజిక్ కూడా మాట్లాడారు టీజీ వెంకటేష్. జనసేతో మాకు పెద్ద విభేదాలు లేవంటూ మరో వ్యాఖ్య చేశారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో పొత్తుల గురించి అధ్యక్షులు తప్ప ఇతరులు మాట్లాడటం జరగదు. కానీ టీజీది కాంగ్రెస్ రక్తం కదా. అందుకే వాగేశారు. దీంతో చంద్రబాబు డంగైపోయి... ఏయ్ టీజీ ఎందుకలా చేస్తావంటూ వార్నింగ్ ఇచ్చారట. టీజీకి ఫోన్ చేసి బాబు అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు. పార్టీ విధానాలు - పాలసీలపై మీరెలా మాట్లాడుతారంటూ ప్రశ్నించారట. సరే బాబు బాధ పక్కన పెడితే... చాలా వేగంగా టీజీకీ పవన్ కళ్యాణ్ నుంచి రిప్లయి వచ్చింది.
అయ్యా టీజీ - మీరు పెద్ద మనిషి అని వదలేసినా - నేను వద్దంటే రాజ్యసభ సీటు నీకు వచ్చింది. నోరు అదుపులో పెట్టుకో. అభివృద్ధి చేస్తారు అని టీడీపీకి మద్దతు ఇస్తే... మీరు నాశనం చేశారు. మీ నుంచి ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాం. కర్నూలును కలుషితం చేశారు. పెద్దోడని వదిలిపెట్టాడం. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ - ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని పవన్ విమర్శించారు.
విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు - సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఈ సందర్భంగా పవన్ సంచలన ఆరోపణలు చేశారు.