Begin typing your search above and press return to search.
చంద్రబాబు అరెస్టు... గల్లా జయదేవ్ కు జైలు
By: Tupaki Desk | 21 Jan 2020 4:13 AM GMTఅసెంబ్లీ ముగిసిన అనంతరం అసెంబ్లీ వద్దే మెట్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. అయితే... వారు మళ్లీ అర్ధరాత్రి పూట మందడం వరకు పాదయాత్ర చేయడానికి బయలుదేరారు. ఈ సమయంలో పాదయాత్రలు శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతాయని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలందరినీ వ్యానులో తీసుకెళ్లారు. కొంత సేపటి తర్వాత మమ్మల్ని ఎక్కడికి తరలిస్తున్నారు అంటూ వారు వాహనం ఆపించి నిరసనకు దిగారు. వ్యానుకు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు చంద్రబాబును, ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.
మరోవైపు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొని ప్రజలను రెచ్చగొట్టినందుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిషేధాజ్జలు దాటుకుని వెళ్లిన నేరం కింద ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు జిల్లా రొంపి చర్ల పోలీస్ స్టేషనుకు తరలించారు. పోలీసులతో జరిగిన వాదులాటలో ఆయన చొక్కా చిరిగిపోయింది. ఆ స్టేషనులో నాన్ బెయిలబుల్ కేసులుపెట్టారు. అనంతరం గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి మెజిస్ట్రేటు జయదేవ్ కు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.