Begin typing your search above and press return to search.

బాబు నోట అవినీతి మాట...వైర‌ల్ అయ్యిందే!

By:  Tupaki Desk   |   21 March 2017 6:26 AM GMT
బాబు నోట అవినీతి మాట...వైర‌ల్ అయ్యిందే!
X
నిజ‌మేనండోయ్‌... దేశంలోనే అవినీతిమ‌య రాష్ట్రాల్లో ఏపీ నెంబ‌ర్‌:1 గా నిలిచింద‌న్న విష‌యాన్ని నిన్న‌టి అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్ష నేత - విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టేశారు. చంద్ర‌బాబు స‌ర్కారు... త‌మ ప‌నితీరును ఆకాశానికెత్తేస్తున్న నివేదిక‌ల‌ను మాత్ర‌మే బ‌య‌ట‌పెడుతూ, త‌మ అవినీతిని బ‌య‌ట‌పెట్టే నివేదిక‌ల‌ను మాత్రం తొక్కిపెడుతోంద‌ని జ‌గ‌న్ స‌భ సాక్షిగా తేల్చేశారు. ఈ మాట‌తో నోట మాట రాని స‌ర్కారు నిజంగా డైల‌మాలోనే ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో... ఎన్నిక అనివార్య‌మైన మూడు చోట్లా విజ‌యం సాధించిన విషయాన్ని తెర‌పైకి తెచ్చిన సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఆవేశ‌పూరితంగా మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోట నుంచి వ‌చ్చిన ఓ మాట‌కు టీడీపీ నేత‌లే షాక్ తిన్నంత ప‌నైంది. అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పార్టీ వ్యూహాలు ర‌చిస్తోంద‌ని ఆరోపించిన చంద్ర‌బాబు... అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్‌ 1 స్థానంలో నిలిపాన‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో అభివృద్ధి కంటే ముందుగా ఆయ‌న నోట నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మాట కూడా వినిపించింది. అవినీతిలోనే కాకుండా, అభివృద్దిలోనూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ 1 గా నిలిపాన‌ని చంద్ర‌బాబు చెప్పేశారు. స‌భ‌లో చంద్ర‌బాబు ఆవేశంగా మాట్లాడుతూ... విపక్షంపై విరుచుకుప‌డుతూ ఉంటే... ఫుల్ జోష్‌ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు... అవినీతిలోనూ రాష్ట్రాన్ని నెంబ‌ర్‌ 1 గా నిలిపానంటూ పేర్కొన‌డంతో ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. ఆ వెంట‌నే జ‌రిగిన పొర‌పాటును తాము గ‌మ‌నించామ‌ని విప‌క్ష స‌భ్యులు ఎక్క‌డ గ‌మ‌నిస్తారోన‌న్న భ‌యంతో త‌మ‌లో క‌నిపించిన త‌త్త‌ర‌పాటును ఏమాత్రం బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

అయితే స‌భ‌లో జ‌రిగే ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా ఆస‌క్తిగా గ‌మ‌నించే జ‌గ‌న్‌... బాబు నోట నుంచి వ‌చ్చిన అవినీతి మాట‌ను కూడా ఇట్టే ప‌ట్టేశారు. వెనువెంట‌నే లేచిన ఆయ‌న అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్‌ 1 స్థానంలో నిలిపామ‌ని చంద్ర‌బాబే చెబుతుంటే... తాము చేస్తున్న వాద‌న కరెక్టే క‌దా అని కొత్త వాద‌న వినిపించారు. అయినా బాబు స‌ర్కారు సాగిస్తున్న అవినీతి పాల‌న‌పైనే క‌దా తాము పోరాటం చేస్తున్న‌దంటూ జ‌గ‌న్ చేసిన వాద‌న‌కు టీడీపీ నుంచి స‌మాధానం క‌రువైంద‌నే చెప్పాలి. చంద్ర‌బాబు నోట నుంచి వ‌చ్చిన అవినీతి టాప్ విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించి ఉండ‌రులే అనుకున్న టీడీపీ నేత‌లు... జ‌గ‌న్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొన‌డంతో కంగు తిన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ చేస్తున్న వాద‌న అంత‌గా విన‌ప‌డ‌కుండా... నానా యాగీ చేసి అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టేలా చేసేశారు. బాబు నోట వ‌చ్చిన అవినీతి మాట‌, దానిని జ‌గ‌న్ ప‌ట్టేసిన వైనంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర‌ర‌మైన చ‌ర్చ‌కు తెర లేసింది. బాబు నోట వ‌చ్చిన అవినీతి మాట‌ల క్లిప్పింగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/