Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఆయన 'గల్లా' పట్టుకుంటారా..?
By: Tupaki Desk | 23 Oct 2015 9:04 AM GMTఇంగ్లిష్ బాగా వచ్చన్న కారణంతో చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు తన వ్యాఖ్యల కారణంగా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించారు. చరిత్రాత్మక కార్యక్రమంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన వేడుకకు వచ్చిన మోడీ రాష్ట్రానికి వరాలు ప్రకటించకపోవడంపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు మండిపడుతున్నారట.
అమరావతి శంకుస్థాపనను గొప్ప పనికి నాంది పలికన కార్యక్రమంగానే చూడాలి కానీ, రాజకీయాలకు వేదిక కానివ్వరాదన్న లక్ష్యంతో చంద్రబాబు మొదటి నుంచీ భావించారు. అందుకు తగ్గట్లుగానే ఆయన రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి అందరి మన్ననలూ పొందారు. అలాంటి తరుణంలో సొంత పార్టీ ఎంపీలే ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో రాష్ట్రం తరఫున కేంద్రం వద్ద పనులు సాధించిపెట్టాల్సిన ఎంపీ ఇలా బాధ్యతారహితంగా ఎలా మాట్లాడుతారని ఆయన అన్నట్లు సమాచారం. దీనిపై గల్లా జయదేవ్ తో మాట్లాడాలనీ చంద్రబాబు అనుకుంటున్నారు.
మరోవైపు జయదేవ్ కేవలం మోడీపై వ్యాఖ్యలు చేయడంతో సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీరు కూడా బాగులేదన్నారు. కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఏమీ సాధించలేమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబు మొత్తం సమాచారాన్ని ఇప్పటికే తెప్పించుకున్నారట. దీనిపై పార్టీ ముఖ్యులతో చర్చించి అసలు ఆయన వ్యవహార శైలికి కారణాలేంటో తెలుసుకుని ముందుముందు ఇలా పార్టీకి, రాష్ట్రానికి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గల్లాకు క్లాస్ తప్పదని తేలిపోయింది.