Begin typing your search above and press return to search.
గంటా మీద చంద్రన్నకు కోపం వచ్చేసింది
By: Tupaki Desk | 16 April 2016 4:56 AM GMTఅధినేత మనసుకు తగ్గట్లుగా నడుచుకోవటం నేతలకు మామూలే. కానీ.. ఏపీ మంత్రి గంటా లాంటి వారు కాస్త మినహాయింపుగా ఉంటారు. తాము ఉండే పార్టీలో కీలకంగా వ్యవహరించే సత్తా ఉండే ఈ నేతలు అధినేత ఎవరైనా మనసు దోచుకునే సామర్థ్యం పుష్కలంగా ఉంటుంది. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు గంటా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాక ఆయనకు మంత్రి పదవి దక్కింది. అక్కడా ఆయన హవా తగ్గలేదు.
విభజన నేపథ్యంలో టీడీపీ తీర్థం తీసుకున్న గంటా.. చంద్రబాబు నాయుడితోనూ సన్నిహితంగా వ్యవహరించటం గంటాకే చెల్లింది. బాబు సర్కారులోనూ మంత్రి పదవిని చేపట్టిన గంటా ఇటీవల కాలంలో బాబు కోపం కలిగేలా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అధినేత మనసును దోచుకున్న గంటా తనను తాను శక్తివంతుడిగా ఫీల్ కావటం.. అధినేతను బైపాస్ చేస్తున్న ఆరోపణలు తమ్ముళ్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ చంద్రబాబుకు చేరటంతో ఆయన గంటా విషయంలో గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన విశాఖలో చిరంజీవి మేనల్లుడు అల్లుఅర్జున్ నటించిన సరైనోడు చిత్ర ఆడియో ఫంక్షన్ ను భారీగా నిర్వహించటం.. ఈ కార్యక్రమంలో గంటా కీలకంగా వ్యవహరించటం.. చిరంజీవికి సన్నిహితంగా మెలగటం లాంటి విషయాల పట్ల చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు.. గంటాల మధ్య చెడిందన్న వార్తలు జోరందుకున్న వేళ.. అధికారులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన మంత్రి గంటా జర్నీకి ఆర్థిక శాఖ కొర్రీ పెట్టి నిలిపివేయటం చూస్తే.. ఆయనకు చంద్రబాబు చెక్ పెట్టినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు. గంటా మీద గుర్రుతోనే ఫారిన్ ట్రిప్ కు బాబు బ్రేకులు వేశారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.