Begin typing your search above and press return to search.
ఏపీలో ఆ టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రజలకు తెలీవట!
By: Tupaki Desk | 13 July 2018 4:36 AM GMTఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనటానికి తాజా ఉదంతం ఒక్కటి చాలు. ప్రజలకు.. అధికారపక్ష ఎమ్మెల్యేలకు మధ్యనున్న దూరం ఎంతన్న విషయాన్ని పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పిన ఉదంతమిది. ఉన్నట్లుండి ఏపీ టీడీపీ ఎంపీలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటులో అనుసరించిన విధానాన్ని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాన్ని బాబు ఖరారు చేశారు. గతం కంటే ఉత్సాహంగా టీడీపీ ఎంపీలు వ్యవహరించాలని.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నా.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో విఫలం చెందుతున్నట్లుగా చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొందరు అధికారపక్ష ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆయా నియోజకవర్గాల ప్రజలు చెప్పలేకపోతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉన్నారని.. కానీ.. దాన్ని రాజకీయంగా మలుచుకునే విషయంలో లోటుపాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
గ్రామదర్శిని.. గ్రామ వికాసం కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. పార్లమెంటుసమావేశాల్లో ఈసారి మరింత ఉత్సాహంగా వ్యవహరించాలని.. కేంద్రం చేసిన తప్పుల్ని అందరికి అర్థమయ్యేలా చేయాలని చెప్పినట్లు తెలిసింది. తమ్ముళ్లు అహంకారాన్ని వదలాలని.. సమన్వయంతో మెలగాలన్న క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటి మాదిరి గంటల కొద్ది టైం తీసుకోకుండా కేవలం అరగంట వ్యవధిలో చంద్రబాబు ఈ సమావేశాన్ని ముగించటం గమనార్హం.
ప్రత్యేక హోదా సాధన విషయంలో వివిధ పార్టీలకు ఏపీకి జరిగిన అన్యాయం గురించి వివరించాలని.. మద్దతు తీసుకురావాలన్నారు. వివిధ పార్టీల మద్దతును కోరే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును మాత్రం అస్సలు కోరకూడదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటం విశేషం. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని మళ్లీ ప్రవేశ పెట్టాలని.. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరినట్లు తెలిసింది. ఏపీకి బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని అందరి దృష్టిని ఆకర్షించేలా చేయాలన్న మాటను బాబు నొక్కి చెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ల పేర్లు సైతం ఓట్లేసిన ప్రజలకు తెలీకపోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.