Begin typing your search above and press return to search.
బాబుదంతా!...అర్ధరాత్రి రాజకీయమే!
By: Tupaki Desk | 28 Feb 2019 7:48 AM GMTటీడీపీ అధినేత - సీఎం నారా చంద్రబాబునాయుడు రాజకీయమంతా అర్ధరాత్రి కేంద్రంగానే సాగుతోందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాతే తీసుకుంటున్న చంద్రబాబు... నేతలను రాత్రి పొద్దుపోయే దాకా వెయిట్ చేయించడం ఇటీవల బాగానే పెరిగింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన బాబు... కొద్దిరోజులుగా రాత్రి పొద్దుపోయే దాకా సమీక్షలు నిర్వహిస్తూ తనదైన మార్కును చూపిస్తున్నారు. అయినా ఎన్నికలన్నాక... అభ్యర్థులను టెన్షన్ కు గురి చేయకుండా ఉండేలా కాస్తంత ముందుగా నిర్ణయాలు తీసుకుంటే... తమ తమ నియోజకవర్గాల్లో వారు కాస్తంత నింపాదిగా పనిచేసుకునే వీలుంటుంది. అయితే చంద్రబాబు ఈ తరహా వెసులుబాటును అభ్యర్థులకు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
తాజాగా ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారును ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన చంద్రబాబు... నేటితో నామినేషన్లకు గడువు ముగుస్తున్న క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. ఓటింగ్ తప్పనిసరి అన్న మూడు శాసనమండలి స్థానాలకు పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి... ఓటమి భయాన్ని చాటుకున్న చంద్రబాబు... ఓటింగ్ లేకుండానే ముగిసే ఎమ్మెల్యే కోటా - గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను నిన్న రాత్రి ప్రకటించారు. మొత్తం ఏడు స్థానాలకు ఏడుగురిని ఎంపిక చేసిన చంద్రబాబు... ఈ ఎంపికలోనూ తనదైన మార్కును చూపించారు. ఎమ్మెల్యేక కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం ఐదింటికి ఎన్నికలు జరగాల్సి ఉండగా... వాటిలో ఓ సీటు వైసీపీ ఖాతాలో పడిపోగా... మిగిలిన నాలుగు సీట్లకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నాలుగు సీట్లకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు - ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్ బాబు - ఉత్తరాంధ్ర రజక సంఘం నేత దువ్వారు రామారావు - కర్నూలుకు చెందిన వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీటీ నాయుడును ఎంపిక చేశారు.
ఇక గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఒకదానిని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు శివనాథరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కోటాలో సిటింగ్ ఎమ్మెల్సీ శమంతకమణికి మరోసారి అవకాశమిచ్చారు. ఇక దివంగత నేత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి బుద్ధా నాగజగదీశ్వరరావును ఎంపిక చేశారు. ఈ ఏడింటిలో ఒక్క విశాఖ స్థానిక సంస్థల కోటా సీటుకు మాత్రమే ఎన్నిక జరగనుంది. మిగిలిన ఆరు సీట్లు యునానిమస్ గానే ఎంపిక కానున్నాయి. అయినా నామినేషన్లకు గడువు ముగిసిపోతున్నా... నింపాదిగా వ్యవహరించిన చంద్రబాబు చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవడం పట్ల పార్టీలో పెద్ద చర్చ సాగుతోంది. చివరి దాకా నాన్చడం ఏమిటో అర్థం కావడం లేదని కొందరు అభ్యర్థులతో పాటు పలువురు నేతలు కూడా బాబు వైఖరిపై లోలోపలే మదనపడుతున్నారు.