Begin typing your search above and press return to search.
సీనియర్లకు బాబు దెబ్బేశారా?
By: Tupaki Desk | 16 March 2015 10:43 AM GMTఏపీ మండలికి జరిగే ఎన్నికలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని చెబుతున్న నిర్ణయం ఆ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మూడు స్థానాలకు మండలి అభ్యర్థులను పంపించే అవకాశం ఉన్న టీడీపీకి సంబంధించి.. ఆ స్థానాల్ని పార్టీ సీనియర్లు.. పయ్యావులు కేశవ్.. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆశించారు.
వీరు ఇరువురు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో.. వారిని మండలికి ఎంపిక చేయటం ద్వారా అధికారాన్ని అప్పగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే ఆశను ఈ ఇద్దరు నేతలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. వారి ఆశలపై నీళ్లు పోస్తూ చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు.
సీనియర్లకు మొండిచేయి చూపిస్తూ.. వీరిద్దరికి అవకాశం ఇవ్వని బాబు.. వీవీవీ చౌదరి.. బీదా రవిచంద్రలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మూడో అభ్యర్థిని బాబు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఎన్నికల్లో ఓడిన వారికి మండలి ద్వారా అవకాశం ఇస్తే.. ఆశావాహుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఇది భవిష్యత్తులో లేనిపోని సమస్యలకు తావిస్తుందన్న ఉద్దేశంతోనే సీనియర్లకు మండలిలో చోటు కల్పించలేదన్న వాదన వినిపిస్తోంది.