Begin typing your search above and press return to search.
టీడీపీ మరో జాబితా.. ఈసారి 9మందికి..
By: Tupaki Desk | 2 March 2019 10:56 AM GMTనెల్లూరు జిల్లాలో టికెట్ల కేటాయింపును టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. నెల్లూరు పార్లమెంట్ , సూళ్లూరుపేట మినహా మిగితా అన్ని నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల విషయంలో టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చింది.
జిల్లాలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారంతా ఇప్పటినుంచే నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని బాబు సూచించారు. నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ విషయంలో సందిగ్ధం ఏర్పడింది. దీన్ని మరో ఐదు రోజులకు వాయిదా వేశారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కావలి ఇన్ చార్జి - కొవ్వూరు ఎమ్మెల్యేలు చంద్రబాబును కోరారు. మరో వైపు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఎంపీ అవకాశం ఇవ్వాలని మరికొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఇక డీసీసీబీ చైర్మర్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కూడా ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరారు. వీరే కాక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు పరీశీలనలో ఉండడంతో చంద్రబాబు ఈ ఎంపీ విషయమై ఐదురోజుల తరువాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారట..అయితే నెల్లూరులో మాగుంట ఆసక్తి చూపకపోతే ఆ టికెట్ విష్ణుకేనన్న ప్రచారం టీడీపీలో జరుగుతోంది.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు.. ఆయా అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అధిక సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు హితబోధ చేశాడట.. వెంకటగిరి రాజాలను సమన్వయం చేసుకోవాలని కురుగొండ్లకు - అలాగే కోవూరులో అసమ్మతి నేతలను బుజ్జగించాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డికి సూచించారు. వీరితోపాటు ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అందరినీ కలుపుకుపోవాలని సూచించారు.
-నెల్లూరు జిల్లా నుంచి బాబు ఖరారు చేసిన అభ్యర్థులు వీరే.. (ప్రాథమికంగా)
*ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య
*కావలి - బీద మస్తాన్ రావు
* గూడూరు - పాశిం సునీల్
* నెల్లూరు సిటీ - మంత్రి నారాయణ
* నెల్లూరు రూరల్ -ఆదాల ప్రభాకర్ రెడ్డి
*సర్వేపల్లి- మంత్రి సోమిరెడ్డి
ఇక సూళ్లూరు పేటలో పరసారత్నం అభ్యర్థిత్వంపై సొంత నియోజకవర్గ నేతలు వ్యతిరేకించడం.. అక్కడ పోటీగా వేనాటి పరంధామరెడ్డి - వేనాటి సతీష్ రెడ్డి - కామిరెడ్డి రాజారెడ్డిలు టికెట్ కోరుతుండడంతో చంద్రబాబు నిర్ణయాన్ని వాయిదావేశారు. నాలుగు రోజుల తర్వాత నిర్ణయిస్తానని తెలిపారు.